వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగి సంస్థలో పనిచేస్తూ యువతిపై గ్యాంగ్‌రేప్: నిందితుల అరెస్ట్, ఎస్ఐపై దాడి

సీఎం యోగి ఆదిత్యనాథ్ స్థాపించిన హిందూ యువ వాహినిలో పనిచేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

|
Google Oneindia TeluguNews

బరేలీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్థాపించిన హిందూ యువ వాహినిలో పనిచేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే.. బరేలీ నగరంలోని గణేశ్ నగర్ ప్రాంతానికి చెందిన హిందూ యువవాహిని కార్యకర్త అయిన అవినాష్ తన సహ కార్యకర్తలైన అనిల్ సక్సేనా, జితేంద్రలను దీపక్ అనే వ్యక్తి ఇంటికి పిలిచాడు. అవినాష్, అనిల్, జితేంద్రలు కలిసి అక్కడ ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిపారు.

Three Hindu Yuva Vahini workers held for ‘assault, rape’ of woman

ఘటన జరిగిన అనంతరం దీపక్ తన సోదరుడు గౌరవ్‌తో వచ్చి అత్యాచారానికి పాల్పడ్డ అవినాశ్‌ను పోలీసులకు అప్పగించాడు. దీపక్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మిగితా నిందితులను అరెస్టు చేశారు.

ఈ తెలియడంతో హిందూయువ వాహినీ సంస్థకు చెందిన ప్రాంతీయ అధ్యక్షుడు జితేంద్ర శర్మ, నగర విభాగం అధ్యక్షుడు పంకజ్, బీజేపీ నగర అధ్యక్షుడు ఉమేష్ కథారియా, ఇతర కార్యకర్తలు పోలీసుస్టేషన్‌కు వచ్చి ధర్నా చేయడంతోపాటు ఎస్ఐ మయాంక్ అరోరాను కొట్టారు.

ఓ యువతిపై గ్యాంగ్ రేప్, ఎస్ఐపై చేయిచేసుకున్న ఘటనలపై రెండు కేసులు నమోదు చేశామని నగర ఎస్పీ రోహిత్ సింగ్ చెప్పారు. ఈ కేసుల్లో నిందితులైన అవినాష్, జితేంద్ర, పంకజ్‌లను అరెస్టు చేశామని ఎస్పీ వివరించారు.

English summary
Three Hindu Yuva Vahini (HYV) workers were arrested on Tuesday for allegedly raping a woman after beating up her mother-in-law at their residence in Subhash Nagar area of Bareilly late Monday. They were accompanied by another HYV member, who is absconding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X