అధికార పార్టీకి షాక్, ప్రతిపక్ష కూటమికి అన్ని లక్షల ఓట్లు, కుల సంఘం నాయకులు డిసైడ్ !

లోక్ సభ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా చాలా విలువైనదే అని నాయకులు పసిగట్టారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎంపీ అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. కర్ణాటకలో కోటేనాడుగా గుర్తింపు తెచ్చుకున్న చిత్రదుర్గలో రోజులు గడుస్తున్న కొద్దీ ఎన్నికల ప్రచార యుద్ధం ముదురుతోంది. లోక్ సభ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఎన్నిల ప్రచారం జోరందుకుంది.

కాంగ్రెస్ అభ్యర్థితో పాటు బీజేపీ, జేడీఎస్ పార్టీల పొత్తు అభ్యర్థులు జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. చిత్రదుర్గ లోక్‌సభ నియోజకవర్గంలో 3 లక్షలకు పైగా కీలక ఓట్లు ఉన్న కాడు గొల్ల కులస్తులు ఈసారి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చే ఆలోచనలో ఉన్నారని వెలుగు చూడటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు బిత్తరపోయారు. లోక్‌సభ నియోజక వర్గంలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాడుగొల్ల సామాజికవర్గానికి కీలకమైన ఓట్లు ఉన్నాయి.

Three lakh Kadogolla castes have decided to vote for BJP in the Lok Sabha elections

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మద్దతు ఇస్తే గిరిజనులు అయిన కాడుగొల్ల సామాజికవర్గానికి ఎస్టీ రిజర్వేషన్లు వస్తాయని ఆ కులం నాయకులు మాట్లాడుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ, జేడీఎస్ పార్టీల కూటమి అభ్యర్థి గోవింద కారజోల, తుమకూరు కూటమి అభ్యర్థి వి. సోమన్నకు మద్దతిచ్చి మన కులాన్ని ఎస్టీలోకి చేర్పించాలని కాడుగొల్ల సమాజిక వర్గం నిర్ణయించిందని తెలిసింది

చిత్రదుర్గ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థి బీఎన్ చంద్రప్పకు కాడుగొల్ల కులస్తులు షాక్ ఇస్తున్నారు. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రులు బీఎస్ యడ్యూరప్ప, హెచ్‌డీ కుమారస్వామితో సహా పలువురు బీజేపీ, జేడీఎస్ నాయకులు లోక్ సభ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత కాడుగొల్ల సమాజిక వర్గాన్ని షెడ్యూల్డ్ తెగలో చేర్చుతామని ఆ కుల సంఘం నాయకులకు హామీ ఇచ్చారు.

మాజీ ప్రధాని దేవెగౌడ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గిరిజన వ్యవహారాల శాఖా మంత్రి అర్జున్ ముండాతో చర్చలు జరిపారని వెలుగు చూసింది. లోక్ సభ ఎన్నికలకు ముందే కాడుగొల్ల సామాజికి వర్గానికి రిజర్వేషన్లు రావాలి. కానీ కొన్ని కారణాల వల్ల రిజర్వేషన్ ఇవ్వలేదు. అందుకే ఐదారు దశాబ్దాలుగా పోరాటానికి ఎన్నికల తర్వాత మూడు నాలుగు నెలల్లో న్యాయం జరుగుతుందని బీజేపీ, జేడీఎస్ కూటమి నేతలు కాడుగొల్ల కులస్తులకు హామీ ఇచ్చారని వెలుగు చూసింది.

Three lakh Kadogolla castes have decided to vote for BJP in the Lok Sabha elections

కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం దాదాపు ఖాయం అయ్యింది. చిత్రదుర్గ లోక్ సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బీఎన్ చంద్రప్పకు మద్దతు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోతుందని, సమాజాభివృద్ధికి శూన్యంగా ఉంటుందని ఆ కుల సంఘం నాయకులు అంటున్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రప్పకు కాడుగొల్ల కుల సంఘం మద్దతు పలికి ఆయనకే ఓట్లు వేశారు.

అయితే ఎన్నికల్లో గెలుపొందిన చంద్రప్ప మా కులానికి ఎలాంటి న్యాయం చెయ్యలేదని, మరోసారి ఆయన్ను గెలిపించినా ఫలితం ఉండదని, అందుకే 3 లక్షల ఓట్లు బీజేపీకి వెయ్యాలని కాడుగొల్ల కుల సంఘం నాయకులు నిర్ణయించారని తెలిసింది. ఈ దెబ్బతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో గుబులు మొదలైయ్యింది. కర్ణాటకలో 40 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాడుగొల్ల కులస్తుల ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+