వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజస్థాన్‌లో గర్ల్స్‌పై రేప్: 24గంటల్లో అరెస్ట్, సిఎం ట్వీట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Three Minors Allegedly Raped in Rajasthan; Police Gets Cracking
జైపూర్: ఉత్తర ప్రదేశ్‌లో వరుస అత్యాచారాలతో అఖిలేష్ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోను ఇటీవల మూడు అత్యాచారాలు జరిగాయి. అయితే వీటిపై వసుందరా రాజే ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మూడు కేసులలోను ఒక్కరు మినహా.. మిగతా నిందితులను ఇరవై నాలుగు గంటల్లో అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి పైన అత్యాచారం జరిగింది.

మొదటి ఘటన శనివారం ఖోళీ గ్రామంలో చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలిక తమ మేకలను మేపేందుకు వెళ్లి మిస్ అయింది. ఆదివారం ఆమె మృతదేహం లభ్యమైంది. కూతురు విగత జీవిగా మారిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు... ఆమె పైన కొందరు అత్యాచారం చేశారని, అనంతరం గొంతు నులిమి చంపేశారని ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురిలో ఇద్దరిని అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు.

రెండో ఘటన శనివారం జరిగింది. నారాయణపుర గ్రామంలో ఐదేళ్ల బాలికను పక్కింటి వ్యక్తి అత్యాచారం చేశాడు. అతని పైన కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు.

మూడో సంఘటన లాడ్లీకా బాస్ గ్రామంలో జరిగింది. పదిహేనేళ్ల దళిత బాలికపై అత్యాచారం చేసిన కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

ఈ అత్యాచారాల పైన దుమారం చెలరేగింది. మరోవైపు రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె వెంటనే స్పందించారు. నిందితులను తక్షణం అరెస్టు చేయాలంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో సత్వరమే స్పందించిన పోలీసులు మూడు కేసుల్లో నిందితులను అరెస్టు చేసి, జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. మొదటి ఘటనలో జరిగిన అత్యాచారం, హత్య కేసులో ఒక నిందితుడు పరారీలో ఉన్నాడు.

కాగా, ఈ అత్యాచారాలకు సంబంధించి వసుంధరా రాజే ట్విట్టర్లో ఎప్పటికప్పుడు వివరణ ఇచ్చారు. నిందితులను అరెస్టు చేయాలని, వారిని చట్టపరంగా శిక్షించాలని తాను డిజిపికి ఆదేశించానని, బాధితులకు న్యాయం చేస్తామని, నిందితులను అరెస్టు చేయడమే కాకుండా వారిని జ్యూడిషియల్ కస్టడీకి పంపించామని ట్వీట్ చేశారు.

English summary
Three Minors Allegedly Raped in Rajasthan; Police Gets Cracking
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X