Cyclone Fengal: తుపాను బీభత్సం - అతలాకుతలం..!!

ఫెయింజల్ తుపాను భారీ బీభత్సం సృష్టించింది. తమిళనాడు, పుదుచ్చేరి తుఫాను ప్రభావం తో అతలాకుతలం చేసింది. ఫెయింజల్ తుపాను మహాబలిపురం-కరైకల్‌ వద్ద తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముగ్గురు ప్రాణాలు కోల్పో యారు. బలమైన గాలులు వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. చెన్నై విమానాశ్రయం నుంచి రాకపోకల పైన ప్రభావం పడింది.

తుఫాను ప్రభావంతో తమిళనాడు అతలాకుతలం అయింది. ప్రధానంగా చెన్నై నగరంలో గత 34 గంటల్లో చాలా ప్రాంతాల్లో 20 సెంటీ మీటర్ల నుంచి 27 సెంటీ మీటర్ల మధ్య వర్షపాతం నమో దైంది. చెన్నై నగరవ్యాప్తంగా 134 ప్రాంతాలు నీట మునిగినట్లు అధికారుల అంచనా వేశారు. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటం, కుండపోత వర్షాలతో సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. బలమైన గాలులు వల్ల చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయని అధికారులు వెల్లడించారు. విద్యుత్ ఘాతం తో వరద నీటిలో ముగ్గురు మృతి చెందారు. చెన్నై విమానాశ్ర యంలోకి నీరు చేరడం వల్ల తాత్కాలికంగా మూసివేశారు.

Three people died in rain-related incidents in Chennai triggered heavy rainfall in north Tamil Nadu

విమాన సర్వీసుల పునరుద్దరణ పైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. వివిధ సంస్థలకు చెందిన మొత్తం 55 విమానాలు తాత్కాలికంగా రద్దయ్యాయి. మరో 12 విమానాలను దారి మళ్లించారు. భారీవర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పాడింది. అటు తుపాను కారణంగా పుదుచ్చేరిలో పర్యాటక ప్రాంతాలనూ మూసేశారు.

Three people died in rain-related incidents in Chennai triggered heavy rainfall in north Tamil Nadu

తమిళనాడులోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 22వేల మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు అధికారులు చెప్పారు. శనివారం చెన్నైలోని విపత్తు నిర్వహణ కంట్రోల్‌ రూంను తమిళనాడు సీఎం స్టాలిన్‌ సందర్శించి ప్రభుత్వ ఏర్పాట్లు, ముందుజాగ్రత్త చర్యలను సమీక్షించారు. పుదుచ్చేరిలో ప్రభావిత ప్రాంతాల్లో 12లక్షల మందిని తీరప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+