బర్త్ డే వేడుకలు, విద్యుత్ షాక్ తో స్పాట్ లో చనిపోయిన పాన్ ఇండియా హీరో ఫ్యాన్స్, అర్దరాత్రి !
కేజీఎఫ్ హీరో యశ్ పాన్ ఇండియా హీరో అయిపోయిన విషయం తెలిసిందే. గతంలో స్యాండిల్ వుడ్ సినిమాలకు మాత్రమే పరిమితం అయిన కన్నడ హీరో యశ్ కేజీఎఫ్- 1, కేజీఎఫ్-2 సినిమాలతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకునా ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయ్యాడు. యశ్ సినిమాలకు ఇప్పుడు దేశవ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంది.
కర్ణాటకలోనే కాకుండా ఇప్పుడు హీరో యశ్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. జనవరి 8వ తేదీన హీరో యశ్ పుట్టినరోజు. జనవరి 8వ తేదీన కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో హీరో యశ్ బర్త్ డే వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా జరుపుకుంటారు. ప్రస్తుతం హీరో యశ్ నటిస్తున్న ట్యాక్సిక్ అనే సినిమా పనుల కోసం విదేశాలకు వెళ్లి అక్కడే పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నాడు.

తన పుట్టిన రోజు అభిమానులకు తాను అందుబాటులో ఉండనని, తాను విదేశాల్లో ఉన్నానని, దయచేసి అభిమానులు తనను క్షమించాలని ఇటీవల హీరో యశ్ ఆయన ఫ్యాన్స్ కు బహిరంగ లేఖ రాశారు. సోమవారం యశ్ పుట్టిన రోజు సందర్బంగా ఆదివారం నుంచి ఆయన అభిమానులు కర్ణాటక వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. హీరో యశ్ పుట్టిన రోజు సందర్బంగా ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు.
కర్ణాటకలోని గదగ్ జిల్లా లక్ష్మేశ్వర్ తాలూకాలోని సురంగి గ్రామంలో అర్ధరాత్రి హీరో యశ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు కటౌట్‌ను నిలుపుతున్న ముగ్గురు అభిమానులకు విద్యుత్ తీగలు తగిలి స్పాట్ లో చనిపోయారు. హనమంత (21), మురళీ (20), నవీన్ ఘాజీ (19) అనే ముగ్గురు యువకులు మృతి చెందారని, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం లక్ష్మేశ్వర్ ఆస్పత్రికి తరలించామని గదగ్ జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.

సోమవారం నటుడు యశ్ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అందుకే హీరో యశ్ అభిమానులు ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని సురంగి గ్రామంలోని అంబేద్కర్ నగర్‌లో ఆదివారం అర్ధరాత్రి కటౌట్‌ను నిలపాలని ప్లాన్ చేశారు. భారీ కటౌట్‌ను నిలుపుతున్న సమయంలో పక్కనే ఉన్నవిద్యుత్ తీగలు తగిలి కటౌట్ పట్టుకుని ఉన్న ఓ యువకుడికి విద్యుదాఘాతమైంది.
ఆ యువకుడిని పట్టుకున్న కొందరు యువకులకు విద్యుత్ షాక్ తగలడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలాన్ని స్థానికులు కొందరు వారి మొబైల్ ఫోన్ లలో చిత్రీకరించారు. ఈ ఘటన లక్ష్మేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు విద్యుత్ షాక్ తో చనిపోవడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు విషాదంలో మునిగిపోయారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications