బెంగళూరు హోటల్స్ లో ఫ్రీగా టిఫిన్లు, భోజనాలు, బంపర్ ఆఫర్, ఎన్నికల్లో !
బెంగళూరు/బళ్లారి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా పలు పార్టీల నాయకులు ఓటర్లకు ఎర వెయ్యకుండా ఎన్నికల అధికారులు బ్రేకులు వేస్తున్నారు. అయితే పలు నియోజక వర్గాల్లో కొందరు నాయకులు వారికి తెలిసిన వారి బర్త్ డే పార్టీలు, శుభకార్యాలు అంటూ వింధులు, మందు పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు.
ఓటర్లను ప్రలోభపెట్టేవారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. అయితే ఐటీ హబ్ లోని రెండు ఫేమస్ హోటల్స్ యాజమాన్యాలు బుధవారం ఓటు హక్కు వినియోగించుకున్న వారికి ఉచితంగా టిఫిన్లు, మద్యాహ్నం భోజనాలు పెడుతామని ఇప్పటికే ప్రకటనలు ఇవ్వడంతో కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

బెంగళూరులోని నిసర్గ గ్రాండ్ హోటల్ యాజమాన్యం బుధవారం ఉదయం ఓటు వేసి వచ్చిన వారికి తమ హోటల్ లో ఉచితంగా టిఫిన్లు పెడుతామని ప్రకటించారు. ఉదయం టిఫిన్ లో బెన్నే దోస (వెన్న దోస), మైసూరు పాకు, తరువాత కూల్ డ్రింక్ ఇస్తామని నిసర్గ హోటల్ యాజమాన్యం ప్రకటించింది. ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చి అందరూ ఓటు వేసేలా చూడటానికి తాము ఈ ఆఫర్ ప్రకటించామని హోటల్ యాజమాన్యం అంటోంది.
2018, 2019లో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్బంలో కూడా అందరూ ఓటు వేసేలా చెయ్యాలని ఇలాంటి ఆఫర్లు ఇచ్చామని ఆ హోటల్ యాజమాన్యం అంటోంది. చాలుక్య సామ్రాట్ హోటల్ యాజమాన్యం కూడా ఓటు వేసి వచ్చిన ప్రజలకు ఉదయం టిఫిన్, మద్యాహ్నం భోజనాలు ఉచితంగా అందిస్తామని ప్రకటించింది.

బెంగళూరులో హోటల్స్, రెస్టారెంట్స్ లో ఉచితంగా టిఫిన్లు, భోజనాలు పెట్టడానికి తాము ఇనుమతి ఇవ్వమని, ఎవరైనా ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బీబీఎంపీ కమీషనర్ తుషార్ గిరినాథ్ హెచ్చరించారు. ఓటర్లను ఎవ్వరూ ప్రలోభపెట్టడానికి వీలులేదని బీబీఎంపీ కమీఫన్ తుషార్ గిరినాథ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications