• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

13 మందిని చంపిన పులి...చివరకు ఏమైందో చూడండి..!

|

ముంబై: అది మహారాష్ట్రలోని యవత‌మాల్ గ్రామం. ఆ గ్రామంలో నివసించే గ్రామస్తులు ఉదయం నిద్రలేవగానే తమ రోజూవారీ కార్యక్రమాల్లో నిమగ్నమైపోతారు. కొందరు పనుల కోసం బయటకు వెళతారు. అలా వెళ్లిన వారు తిరిగి ఇంటికి చేరుకోవడం లేదు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఏకంగా 13 మంది కనిపించకుండా పోయారు. ఏమైందో అని గ్రామస్తులు చాలా ఆందోళనకు గురయ్యారు. 13 మంది ఏమయ్యారని గ్రామస్తులు ఆరాతీయగా.. ఆ నిజం తెలుసుకుని షాక్‌కు గురవడమే కాదు వారి ప్రాణాలు కూడా అరచేతిలో పెట్టుకుని భయం భయంగా గడిపారు. ఇంతకీ ఆ 13 మంది ఏమయ్యారు... ఎలా అదృశ్యమయ్యారు తెలుసుకోవాలంటే ఈ కథ చదవండి...

13 మందిని పొట్టనబెట్టుకున్న పులి

13 మందిని పొట్టనబెట్టుకున్న పులి

మహారాష్ట్రలో యవతమాల్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో 13 మంది కనిపించకుండా పోయారు. తీరా గ్రామస్తులు అదృశ్యమైన ఆ 13 మందికోసం విచారణ చేశారు. వారు తెలుసుకున్న నిజం వారిని షాక్‌కు గురిచేసింది. ఆ 13 మంది ప్రాణాలు తీసేసింది అవని అనే ఆడపులి. చీకటి పడగానే ఆ పెద్ద పులి గ్రామంలోకి ప్రవేశించి కనిపించిన వారిపై దాడి చేసి వారిని లాక్కెల్లి చంపి ఆహారంగా తీసుకునేది. ఇలా ఆగ్రామంలో ఏకంగా 13 మందిపై దాడి చేసి చంపేసింది ఆ పెద్దపులి.

పులిని ప్రాణాలతో పట్టుకోవాలంటూ కోర్టులో పిటిషన్

పులిని ప్రాణాలతో పట్టుకోవాలంటూ కోర్టులో పిటిషన్

ఇలా పులికి భయపడి ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలని అని ఆలోచించారు గ్రామస్తులు. ఆ పులిని చంపుదామని అంతా డిసైడ్ అయ్యారు. అసలే దేశంలో పులుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. అలాంటిది ఉన్న పులులను చంపితే ఎలా అంటూ జంతు ప్రేమికులు కోర్టులను ఆశ్రయించారు. కావాలంటే పులిని ప్రాణాలతో పట్టుకుని దాన్ని బంధించండంటూ వారు పిటిషన్ వేశారు. కానీ ఆ పులికి ఇవేమీ తెలియదు. కేవలం మనిషి కనపడితే చాలు అమాంతం దాడి చేయడం తన కడుపును నింపుకోవడం మాత్రమే తెలుసు.

పులి కనిపిస్తే కాల్చేయండి : సుప్రీంకోర్టు

పులి కనిపిస్తే కాల్చేయండి : సుప్రీంకోర్టు

ఈ కోర్టు ఆకోర్టు చేరి చివరికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కేసు చేరింది. ఈ ఏడాది మొదట్లోనే సుప్రీంకోర్టు 13 మందిని చంపిన పులి బతకకూడదంటూ కనిపిస్తే కాల్చేసేయాలన్న ఆదేశాలు పోలీసులకు అటవీశాఖ సిబ్బందికి ఇచ్చింది. జంతు ప్రేమికుల పిటిషన్‌ను కొట్టివేసింది కోర్టు. ఆ పులి ప్రాణాలకంటే మనిషి ప్రాణాలకే ఎక్కువ విలువ ఉందని వ్యాఖ్యానిస్తూనే... అవని అనే ఈ పులిని వదిలేస్తే ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందో అనే అనుమానం వ్యక్తం చేసింది సర్వోన్నత న్యాయస్థానం.

పులిని చంపేయడంతో సంబురాలు చేసుకున్న గ్రామస్తులు

పులిని చంపేయడంతో సంబురాలు చేసుకున్న గ్రామస్తులు


పులి ఎప్పుడెప్పుడు వస్తుందా దానిని కాల్చి చంపుదామా అని గ్రామస్తులతో పాటు అటవీశాఖ సిబ్బంది కూడా ఎదురు చూశారు. ఇక శుక్రవారం రాత్రి పులి రానే వచ్చింది. అంతే దెబ్బకు దానిపై బుల్లెట్ల వర్షం కురిపించి చంపేశారు. దీంతో గ్రామానికి పట్టిన పులి పీడ విరుగడైందని గ్రామస్తులు సంతోషపడ్డారు. అంతేకాదు సంబురాలు జరుపుకుని ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఇదిలా ఉంటే ఈ పులిని చంపడంకంటే ప్రాణాలతో పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఆన్‌లైన్‌లో దాదాపు 9వేల మంది జంతు ప్రేమికులు పిటిషన్‌పై సంతకాలు చేశారు. మరోవైపు పులులు సామాన్యంగా మనుషులపై దాడి చేయవని...ఒక్కసారి దాడి చేసి మనిషి మాంసం రుచి చూస్తే ఇక వదలవని జంతు నిపుణులు చెబుతున్నారు.

 ఏటా డజను పులులు మృతి

ఏటా డజను పులులు మృతి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల సంఖ్యలో సగానికి పైగా భారతదేశంలోని అటవీ ప్రాంతాల్లోనే ఉన్నట్లు 2014 గణాంకాలు తెలుపుతున్నాయి. భారత దేశంలో 2,226 పులులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రతి ఏటా డజనుకు పైగా పులులు మృతి చెందుతున్నాయి. ఇందులో కొన్ని పులులను మానవుడు వేటాడుతుండగా మరికొన్ని పులులు అనారోగ్యంతో మృతి చెందుతున్నాయి. అక్టోబర్ 2016లో ఉత్తర భారతంలో ఓ పులిని చంపేశారు అటవీశాఖ సిబ్బంది. అది సమీప గ్రామంలోకి చొరబడి ముగ్గురు గ్రామస్తుల ప్రాణాలను తీసిందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ గ్రామస్తులు పులి మృతదేహంతో ఊర్లో ఊరేగించి సంబరాలు చేసుకున్నారు.

మరిన్ని supreme court వార్తలుView All

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man-eating tigress named Avni who is believed to have been responsible for 13 deaths in Maharashtra was reportedly killed in the state’s Yavatmal region on Friday night, ANI reported.The Supreme Court had earlier this year issued ‘shoot at sight’ orders against the tigress, officially called T1, and dismissed appeals by animal rights activists to capture her alive instead.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more