వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టైమ్స్ నౌ వీఎంఆర్ ఎగ్జిట్ పోల్స్ .. యూపీలో ఎన్డీఏకు గట్టి దెబ్బ కొట్టనున్న మహాఘట్ బంధన్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Election 2019 :TIMES NOW-VMR ఎగ్జిట్ పోల్స్ యూపీలో మోడీకి గట్టి దెబ్బ | Oneindia Telugu

టైమ్స్ నౌ వీఎంఆర్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2019 విడుదలయ్యాయి లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ 306 సీట్లు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ విఎంఆర్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. మరోమారు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పట్టం కట్టనున్నట్టు పేర్కొంది. ఎన్డీఏ కూటమి మే 19న జరిగిన ఎన్నికల్లో 132 సీట్లను సాధించవచ్చని సర్వే తెలిపింది. దేశంలోనే అతి ముఖ్య రాష్ట్రంగా భావించే ఉత్తరప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువరించింది టైమ్స్ నౌ విఎంఆర్. 2014 లోలా ఈ దఫా ఎన్డీయే ప్రభావం కనిపించదని పేర్కొంది. మహాఘట్ బంధన్ బాగా పుంజుకుంటుంది అని వెల్లడించింది.

ఇండియా టుడే ఎగ్జిట్‌పోల్ ఫలితాల్లో ఎన్డీఏకు ఆధిక్యతఇండియా టుడే ఎగ్జిట్‌పోల్ ఫలితాల్లో ఎన్డీఏకు ఆధిక్యత

అతి పెద్ద రాష్ట్రంలో ఈసారి ఎన్డీఏకు దెబ్బ ... పుంజుకోనున్న మహా ఘట్ బంధన్

అతి పెద్ద రాష్ట్రంలో ఈసారి ఎన్డీఏకు దెబ్బ ... పుంజుకోనున్న మహా ఘట్ బంధన్

80 లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ఈసారి 73 స్థానాల నుండి 56 స్థానాలకు పడిపోతుంది అని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించింది . మే 23న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో టైమ్స్ నౌ వి ఎం ఆర్ నిర్వహించిన సర్వేలో ఎస్పి, బిఎస్పి, ఆర్ ఎల్ డి ల కూటమి మహా ఘట్ బంధన్ 20 స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. 2014లో ఈ పార్టీలు కేవలం ఐదు స్థానాలు మాత్రమే గెలుచుకున్నాయి. ఇక ఈ సారి యూపీలో కాంగ్రెస్ రెండు స్థానాలు గెలుచుకుంటుంది అని అంచనా వేసింది.

2014 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను దక్కించుకుంది ఈ దఫా కూడా రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవచ్చని అంచనా వేస్తోంది.

యూపీలో టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వే ప్రకారం పోలింగ్ పర్సంటేజ్ ఇలా

యూపీలో టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వే ప్రకారం పోలింగ్ పర్సంటేజ్ ఇలా

ఇక పోలింగ్ శాతం చూసినట్లయితే ఎన్డీఏ పోలింగ్ శాతం 2014లో 43.3 శాతం కాగా 2019 నాటికి కాస్త మెరుగుపడి 40 4.8 శాతానికి చేరిందని అంచనా వేసింది. ఇక మహా ఘట్ బంధన్ పోలింగ్ శాతం 42.6 5 శాతం నుండి 40.2 శాతానికి తగ్గిందని అంచనా వేసింది. మరోవైపు కాంగ్రెస్ ఓటింగ్ పర్సంటేజ్ 2014లో 8.4 శాతం నుంచి 2019 నాటికి 9.3 శాతానికి పెరుగుతుందని వెల్లడించింది కాంగ్రెస్ వోటింగ్ శాతం కాస్త మెరుగు పడినట్లుగా అంచనా వేసింది ఇక ఇతరుల పోలింగ్ పర్సంటేజ్ లో కూడా 2014లో 5.65 శాతం నుండి 2019 నాటికి 5.7 శాతానికి మెరుగుపడిందని పేర్కొంది.

గత ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా 17 స్థానాలు ఎన్డీయే కు తక్కువ వచ్చే అవకాశం .

గత ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా 17 స్థానాలు ఎన్డీయే కు తక్కువ వచ్చే అవకాశం .

ఇక ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ రాష్ట్రంలో గతంతో పోలిస్తే 17 స్థానాలు కోల్పోయి అతి పెద్ద ఓటమిని నమోదు చేసుకుంది. యూపీలో బి ఎస్ పి, ఎస్ పి, ఆర్ ఎల్ డి లు ఈసారి ఎలాగైనా మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న లక్ష్యంతో మహా ఘట్ బంధన్ లో కలిసి పోరాడాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి నుంచి ఎన్నికల బరిలోకి దిగితే ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అజమ్గడ్ నుండి పోటీ చేశారు. మొత్తానికి 2014 తో పోల్చుకుంటే మహా ఘట్ బంధన్ బలపడగా ఎన్డీఏ బలహీనపడింది. టైమ్స్ నౌ వీఎంఆర్ ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ 3211 చోట్ల 40 వేల మంది ఓటర్లను ప్రాతిపదికగా తీసుకొని సర్వే నిర్వహించి ఈ ఫలితాలను వెల్లడించింది.

English summary
In Uttar Pradesh, the seat share of the BJP-led NDA will decline from 73 in 2014 to 56 in 2019, as predicted by Times Now-VMR exit poll, which has come out four days before the announcement of results on May 23. The exit poll says SP-BSP-RLD will secure 20 seats. The parties that are now in coalition under the mahagathbandhan had between themselves won five seats in 2014. The survey predicts just two seats for the Congress in 2019. The grand old party had got only two seats in 2014. The others, who failed to win even a single seat in 2014, are expected to win two seats this year. There are 80 parliamentary seats in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X