చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వం నుంచి ఆలయాలకు విముక్తి: తిరుపతి బీజేపీ-జనసేన మేనిఫెస్టో కీలకాంశాలు

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ-జనసేన మేనిఫెస్టోను ఆదివారం విడుదలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనం నుంచి దేవాలయాలను తొలగించడం, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మెగా ఇన్వెస్టిమెంట్ టెక్స్‌టైల్స్ పార్క్ ఏర్పాటుతోపాటు పలు అంశాలతో కూడిన ప్రత్యేక మేనిఫఎస్టోను విడుదల చేసింది.

టీటీడీ ఆస్తులు విక్రయమా?

టీటీడీ ఆస్తులు విక్రయమా?

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, రాజ్యసభ ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, టీజీ వెంకటేష్, బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీటీడీ ఆస్తులను విక్రయించాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందని సోము వీర్రాజు అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని పవిత్రతను పరిరక్షించే విధంగా తమ మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలిపారు.

తిరుపతి రూపురేఖలు మార్చే మేనిఫెస్టో

తిరుపతి రూపు రేఖలు మార్చే అద్భుతమైన మేనిఫోస్టోను బీజేపీ-జనసేన పార్టీల నేతలు, మేధావులు కలిసి రూపకల్పన చేశారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎంపీ జీవీఎల్ నర్సింహారావు మాట్లాడుతూ.. మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు.48 కోట్ల రూపాయల కేంద్రం నిధులతో భక్తకన్నప్ప పాఠశాలలు, ప్రతీ ఇంటికి తాగునీరు సరఫరానిచ్చేలా జలమే జీవనం పథకం, కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు, పులికాట్ సరస్సులో మత్స్యకారుల సంక్షేమ కోసం ఆంధ్రా-తమిళనాడు మధ్య సరిహద్దుల రీసర్వే, పూడికతీత పనులు వంటి అనేక ప్రజా ప్రయోజన అంశాలను మేనిఫెస్టోలో పొందుపర్చినట్లు తెలిపారు.

బీజేపీ-జనసేన మేనిఫెస్టోలోని పలు కీలకాంశాలు

మేనిఫెస్టోలోని ఇతర కీలకాంశాలు

తిరుమలలో అన్యమత ప్రచారానికి అడ్డుకట్ట వేయడం
టీటీడీని ధర్మాచార్యుల పర్యవేక్షణలోకి తీసుకురావడం
తిరుపతిలో శరభయ్య విగ్రహం ఏర్పాటు
రూ. 48కోట్లతో భక్త కన్నప్ప పేరు మీద ఏకలవ్య పాఠశాలలు
ప్రతి రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డు, రూ. 2 లక్షల రుణ సౌకర్యం
పులికాట్ సరస్సులో పూడికతీత పనులు
తిరుపతి లోక్‌సభ పూడికతీత పనులు
పాడి, గొర్రెల రైతులకు కిసాన్ క్రెడిట్ ద్వారా రుణాలు

English summary
Tirupati bypoll: bjp janasena manifesto released.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X