రేపు తిరుపతికి మోడీ: సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవం, వెంకన్న దర్శనం..
తిరుపతిలో నిర్వహించనున్న 104వ భారత సైన్స్ కాంగ్రెస్ సదస్సును మంగళవారం నాడు ప్రధాని మోడీ ప్రారంభిస్తారు.
విజయవాడ: భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు ఏపీలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా.. తిరుపతిలో నిర్వహించనున్న 104వ భారత సైన్స్ కాంగ్రెస్ సదస్సును ఆయన ప్రారంభిస్తారు. శ్రీవేంకటేశ్వర విశ్వ విద్యాలయం వేదికగా రేపటి నుంచి 7వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది.
సైన్స్ కాంగ్రెస్ సదస్సు అనంతరం మోడీ శ్రీ వేకంటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. వెంకన్న దర్శనం తర్వాత తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. కాగా, సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హాజరవుతారు.

వివిధ దేశాలకు చెందిన పలువురు నోబెల్ బహుమతి గ్రహీతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. సభలో పాల్గొనున్న మోడీ తన సందేశాన్ని ఇవ్వనున్నారు. ప్రసంగం అనంతరం నోబెల్ గ్రహీతలతో ఆయన ముచ్చటిస్తారు.
సైన్స్ కాంగ్రెస్ సదస్సు కోసం మొత్తం 10,500 మంది రిజిస్టర్ చేసుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పలు దేశాలకు చెందిన 200మంది శాస్త్రవేత్తలు విచ్చేయనున్నారు.












Click it and Unblock the Notifications