Viral Video:ఫ్రైడ్ రైస్ ఆలస్యం..క్యాషియర్ తల పగిలింది!
తిరుప్పూర్:ఈ మధ్యకాలంలో మనిషి అనేవాడికి ఆలోచన తక్కువైపోతోంది. ఆవేశం ఎక్కువైపోతోంది. చిన్న చిన్న సమస్యలకే సహనం కోల్పోయి అవతల వ్యక్తిపై దాడులకు దిగుతున్నారు. ఫలితంగా జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి తమిళనాడులో జరిగింది. ఓ హోటల్‌లో చోటు చేసుకున్న వాగ్వాదం ఒక వ్యక్తిని జైలుకు పంపింది. ఆ వీడియోలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా వీరపాండి పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న 'పెప్సీ' (Pepsi) అనే రెస్టారెంట్‌లో ఆదివారం సాయంత్రం ఘోర అమానుష ఘటన చోటు చేసుకుంది. ఫ్రైడ్ రైస్ ఇవ్వడంలో ఆలస్యం జరిగిందనే కోపంతో ఒక వ్యక్తి రెస్టారెంట్‌ను ధ్వంసం చేయడమే కాకుండా, క్యాషియర్‌పై దాడి చేసి తలకు తీవ్ర గాయాలు చేశాడు.

వివరాల్లోకి వెళితే.. అదే ప్రాంతానికి చెందిన గౌతమ్ అనే యువకుడు రెస్టారెంట్‌కు వచ్చి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాడు. అయితే, తన తర్వాత వచ్చిన వారికి ఆహారం అందించారని, తనకు ఆలస్యం చేస్తున్నారని గౌతమ్ రెస్టారెంట్ సిబ్బందితో గొడవకు దిగాడు. ఈ వాగ్వాదం తీవ్రమవడంతో, ఆగ్రహించిన గౌతమ్ తన స్నేహితులకు ఫోన్ చేసి రెస్టారెంట్‌కు రమ్మని చెప్పాడు.
క్షణాల్లో ఆరుగురు స్నేహితులు అక్కడికి చేరుకున్నారు. వారితో కలిసి గౌతమ్ రెస్టారెంట్‌లోని అద్దాలను పగలగొట్టాడు. అనంతరం రెస్టారెంట్ మాస్టర్ (చెఫ్) మరియు క్యాషియర్ జహీర్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో గౌతమ్ పక్కనే ఉన్న కుక్కర్ మూతను తీసుకుని క్యాషియర్ జహీర్ ముఖం మరియు తలపై బలంగా కొట్టడంతో, అతనికి తీవ్ర గాయాలై రక్తం కారింది.
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా వీరపాండి పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న 'పెప్సీ' (Pepsi) అనే రెస్టారెంట్‌లో ఈరోజు సాయంత్రం ఘోర అమానుష ఘటన చోటు చేసుకుంది. ఫ్రైడ్ రైస్ ఇవ్వడంలో ఆలస్యం జరిగిందనే కోపంతో ఒక వ్యక్తి రెస్టారెంట్‌ను ధ్వంసం చేయడమే కాకుండా, క్యాషియర్‌పై దాడి చేసి తలకు తీవ్ర… pic.twitter.com/UbR6Jxr5SD
— oneindiatelugu (@oneindiatelugu) November 17, 2025
ప్రమాదాన్ని గుర్తించిన రెస్టారెంట్ సిబ్బంది, అక్కడున్న ప్రజలు కలిసి గౌతమ్‌ను పట్టుకున్నారు. అయితే, అతడితో వచ్చిన ఆరుగురు స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. పట్టుబడిన గౌతమ్‌ను వీరపాండి పోలీసులకు అప్పగించారు.
రెస్టారెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు జరిపిన పోలీసులకు గౌతమ్‌పై పదికి పైగా క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది. రెస్టారెంట్‌ను ధ్వంసం చేయడం, సిబ్బందిపై దాడి చేయడం, ప్రాణాపాయం కలిగించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు గౌతమ్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా ఆరుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈ దాడిపై సమాచారం అందుకున్న తిరుప్పూర్ హోటల్ యజమానుల సంఘం ప్రతినిధులు, తమకు రక్షణ కల్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వీరపాండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications