తమిళనాడులో షాకింగ్.. ఏపీ యువతిపై పోలీసులు అత్యాచారం..!
చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే కామాంధులుగా మారిన ఘటన సంచలనం రేపుతోంది. మహిళలకు, యువతులకు అండగా ఉండాల్సింది పోయి వారిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దారుణమైన ఘటన తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్ర ప్రాంతమైన తిరువణ్ణామలైలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
సెప్టెంబర్ 30 మంగళవారం రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఓ యువతి స్పృహ కోల్పోయి ఉండటాన్ని స్థానిక గ్రామస్థులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వాళ్లు యువతిని తిరువణ్ణామలైలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించి వైద్య చికిత్స అందించారు. అయితే అంతకుముందు పెట్రోలింగ్ లో ఉన్న ఇద్దరు పోలీసులు ఏపీకి చెందిన 18 ఏళ్ల యువతిని బెదిరించి పొదల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం.
ఏం జరిగింది..?
సెప్టెంబర్ 30 మంగళవారం తెల్లవారుజామున ఆంధ్రా నుంచి తల్లీకూతుళ్లు టమాటలతో తిరువణ్ణామలై వెళుతున్న ఒక గూడ్స్ వాహనంలో ఎక్కారు. అయితే ఆ గూడ్స్ వాహనంలో తల్లీకూతుళ్లు, డ్రైవర్ తప్ప మరెవరూ లేరు. వాహనం రాత్రి సమయానికి ఎంథాల్ బైపాస్ వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో బైపాస్‌పై పెట్రోలింగ్ చేస్తున్న సురేశ్ రాజ్, సుందర్ అనే ఇద్దరు పోలీసులు వాహనాన్ని ఆపారు. తనిఖీ చేయాలని చెప్పారు. తల్లీకూతురు కిందకు దిగారు. ఈ క్రమంలో ఆ గూడ్స్ వాహనం వ్యక్తి పారిపోయాడు.

తల్లీకూతురు అక్కడే ఉన్నారు. వారిని ప్రశ్నించగా తిరువణ్ణామలై దేవస్థానానికి వెళ్తున్నట్టు తెలిపారు. అయితే తమ వాహనం మీద తీసుకెళ్తామని వారికి మాయ మాటలు చెప్పారు. విల్లుపురం రోడ్డుకు తీసుకెళ్లారు. అక్కడే ఓ కానిస్టేబుల్ తల్లిని ముళ్లపొదల్లోకి నెట్టివేయగా.. మరొకరు యువతిని శ్మశాసవాటిక ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంతలో తల్లి తేరుకుని స్థానికంగా ఉన్న ఇటుక బట్టీల ప్రాంతానికి వెళ్లి జరిగిన విషయం చెప్పగా వాళ్లు 108కు ఫోన్ చేశారు. ఇంతలో కూతురు కూడా అక్కడికి చేరుకోవడంతో ఇద్దర్నీ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కానిస్టేబుళ్లను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications