వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిద్ధూకు సంవత్సరం జైలు శిక్ష

|
Google Oneindia TeluguNews

మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు సంవత్సరంపాటు జైలు శిక్ష విధించింది. 1988లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో ఈ తీర్పు వెలువరించింది. ఆ సంఘటనకు సంబంధించిన కేసులో కేవలం రూ.వెయ్యి జరిమానాతో సిద్ధూను వదిలిపెట్టారంటూ దాన్ని వ్యతిరేకిస్తూ బాధితులు వేసిన రివ్యూ పిటిషన్ పై సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.

1988 డిసెంబరు 27వ తేదీన పాటియాలాలో పార్కింగ్ విషయానికి సంబంధించి సిద్ధూ, అతని స్నేహితుడు రూపిందర్ సింగ్ ఇద్దరూ 65 సంవత్సరాల వయసున్న గుర్నామ్ సింగ్ తో గొడవ పడ్డారు. ఈ వివాదంలో సిద్ధూ, అతని స్నేహితుడు ఇద్దరూ కలిసి గుర్నామ్ ను కారునుంచి బయటకు లాగి దాడిచేశారు. ఈ గొడవలో గుర్నామ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

tittle Congress leader Navjot Sidhu sentenced 1year jail, here is the reason

ఈ కేసుకు సంబంధించి 2018 మేలో సిద్ధూకు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ కింది కోర్టు తీర్పునిచ్చింది. అయితే బాధితుడి కుటుంబ సభ్యులు ఈ తీర్పును వ్యతిరేకిస్తూ అదే సంవత్సరం సెప్టెంబరులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఏడాదిపాటు జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

English summary
Congress leader Navjot Sidhu sentenced 1year jail, here is the reason
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X