వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్‌లో కాల్పుల కలకలం.. టీఎంసీ నేత సోఫిపుల్ హసన్ దారుణ హత్య, బంద్‌కు పిలుపు

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా : గత కొద్దిరోజులుగా స్తబ్ధుగా ఉన్న బెంగాల్‌లో మరోసారి కలకలం చెలరేగింది. ప్రశాంతంగా ఉన్న వాతావరణం కాస్త కాల్పులతో అలజడి నెలకొంది. అధికార టీఎంసీ నేత ఒకరు తూటాలకు ప్రాణాలొదిరారు. తమ పార్టీ నేతను హత్య చేసింది బీజేపీ పార్టీయేనని టీఎంసీ ఆరోపించింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నేతల దాడులు పెరిగిపోయాయని మండిపడింది. మరోవైపు టీఎంసీ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. ఇటీవల జరిగిన దాడుల్లో తమ పార్టీ కార్యకర్తలే చనిపోయారని గుర్తుచేసింది.

TMC leader Sofiul Hasan shot in Murshidabad

పేలిన తూటా ..
హుమైపూర్ గ్రామానికి చెందిన అర్దొసా బీబీ భర్త, టీఎంసీ నేత సోఫిపుల్ హసన్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన ఒక్కసారిగా నెలకొరిగారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే చనిపోయారని వైద్యులు తెలిపారు. హసన్ ముర్షిదాబాద్‌లోని ప్రదీప్నగ గ్రామం నుంచి వస్తుండగా కాల్పులు జరిపారు. హరిపర్పారా వద్ద దుండగులు తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయాయి. హసన్‌పై కాల్పులకు సంబంధించి వివరాలు తెలియరాలేదని పోలీసలుు తెలిపారు. ఎవరు జరిపారు ? ఎందుకు ఫైర్ చేశారనే అంశాలు విచారణలో తేలుతాయని పేర్కొన్నారు. హసన్‌పై కాల్పులను నిరసిస్తూ సిన్సురాలో 12 గంటలు బంద్‌కు టీఎంసీ పిలుపునిచ్చింది.

మరోవైపు కొద్దిరోజుల క్రితం టీఎంసీ నేత హుగ్లి జిల్లా బందేల్ రైల్వేస్టేషన్ వద్ద కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. తర్వాత అతనిని రైల్వే ట్రాక్ మీద పడేసి వెళ్లిపోయారు. అప్పటికే దిలీప్ రామ్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసం కోల్ కతా తీసుకెళ్లేలోపు చనిపోయారు. కొద్దిరోజుల క్రితం ముర్షిదాబాద్‌లో బాంబు పేలి ముగ్గురు టీఎంసీ కార్యకర్తలు చనిపోయిన సంగతి తెలిసిందే.

English summary
Trinamool Congress leader was shot by some unidentified assailants on Friday. The TMC leader has been identified as Humaipur village head Ardosa Bibi's husband, Sofiul Hasan. The incident happened in Pradipdanga village in Murshidabad when Sofiul Hasan was on his way towards Hariharpara in West Bengal. An investigation is underway. The reason behind the murder of Sofiul Hasan has not been ascertained.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X