జేపీసీ మీటింగ్ లో గ్లాస్ పగలగొట్టిన టీఎంసీ ఎంపీ-నాలుగు కుట్లు-సస్పెన్షన్..!
వక్ఫ్ బోర్డు చట్టం సవరణ బిల్లుపై చర్చ కోసం ఇవాళ ఢిల్లీలో జరిగిన జాయింట్ పార్లమెంటరీ పార్టీ (జేపీసీ) భేటీ గందరగోళంగా ముగిసింది. ఈ భేటీలో వక్ఫ్ బోర్డు చట్టం సవరణకు అనుకూలం, వ్యతిరేకంగా వాదనలు సాగాయి. బీజేపీ వర్సెస్ ఇండియా కూటమి పార్టీలుగా విడిపోయిన ఎంపీలు వాదులాడుకున్నారు. ఓ దశలో బీజేపీ ఎంపీ ఒకరు చేస్తున్న వాదనతో విభేదించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఏకంగా బెంచ్ పైనే గ్లాస్ తీసి విసిరేశారు.
వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుపై జేపీసీ చర్చలో బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ్ తో వాదనకు దిగిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. ఓ దశలో ఆగ్రహంతో ఊగిపోయారు. చివరికి తన బెంచ్ పై ఉన్న గాజు గ్లాస్ ను కిందకు విసిరేసే ప్రయత్నంలో ఆయన కూడా గాయపడ్డారు. దీంతో కళ్యాణ్ బెనర్జీని అక్కడే ఉన్న ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు నాలుగు కుట్లు వేశారు.

వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చలో బీజేపీ ఎంపీలతో సమానంగా ఇండియా కూటమి ఎంపీలు కూడా గట్టిగా వాదించారు. ఓ దశలో ఇరువురూ వ్యక్తిగత దూషణల వరకూ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సంయమనం కోల్పోయిన తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ గ్లాస్ పగులగొట్టేందుకు ప్రయత్నించి గాయాల పాలయ్యారు ఆయన చేతికి గాయమైంది. మరోవైపు కళ్యాణ్ బెనర్జీ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిటీ ఛైర్మన్ జగదంబికా పాల్ ఆయన్ను వచ్చే సమావేశానికి రాకుండా సస్పెండ్ చేశారు.
#WATCH | Delhi: TMC MP Kalyan Banerjee leaves from the meeting of the JPC (Joint Parliamentary Committee) on the Waqf Bill. pic.twitter.com/VdKErrBCcG
— ANI (@ANI) October 22, 2024












Click it and Unblock the Notifications