గవర్నర్‌ను కలిసిన పళని: శశికళను రప్పించేందుకు సీఎం పావులు?
తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావును ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదివారం నాడు రాజ్ భవన్‌లో కలిశారు. బల నిరూపణ సందర్భంగా శనివారం నాడు అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలను ఆయన వివరించారని తెలుస్తోంది.
చెన్నై: తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావును ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదివారం నాడు రాజ్ భవన్‌లో కలిశారు. బల నిరూపణ సందర్భంగా శనివారం నాడు అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలను ఆయన వివరించారని తెలుస్తోంది.
పోయెస్ గార్డెన్‌లో గెలుపు సందడి
శనివారం నాడు అసెంబ్లీలో డివిజన్ ఓటు ద్వారా ముఖ్యమంత్రి పళనిస్వామి బలం నిరూపించుకున్నారు. జైల్లో ఉన్న శశికళ కూడా దీనిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు పోయెస్ గార్డెన్‌లో శశికళ వర్గీయులు సంబరాలు కూడా చేసుకున్నారని తెలుస్తోంది.
తమిళనాడుకు శశికళ తరలింపు?

బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుంచి చెన్నై లేదా వేలూరు జైలుకు శశికళను త్వరలో తరలించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాష్ట్రంలో అధికారం తమ చేతికి రావడంతో.. ఇక చిన్నమ్మ క్షేమాన్ని కాంక్షించే రీతిలో పావులు కదిపే పనిలో పళనిస్వామి పడ్డారని అంటున్నారు.
సోమవారం నాడు కర్నాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు అన్నాడీఎంకే వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. బెంగళూరు జైలులో ఎలాంటి ప్రత్యేక వసతులు లేవు. దీంతో ప్రత్యేక వసతులు కలిగిన తమిళనాడు జైలుకు తరలించాలని భావిస్తున్నారట.
శనివారం నాడు బలనిరూపణలో పళనిస్వామి విజయం సాధించారు. దీంతో, ఇక శశికళను చెన్నై లేదా వేలూరు జైలుకు మార్చేందుకు అన్నాడీఎంకే, ప్రభుత్వ వర్గాలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే న్యాయవాదులు ఈ విషయమై శశికళతో సంప్రదింపులు జరిపారని, ప్రక్రియను వేగవంతం చేయనున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications