జయలలిత మృతి: విచారణకు హాజరైన షీలా బాలక్రిష్ణన్, ఆ విషయాలు మొత్తం !
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి మిస్టరీ విషయంపై విచారణ జరుపుతున్న మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు గురువారం మాజీ ఐఏఎస్ అధికారిని, తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ షీలా బాలక్రిష్ణన్ హాజరైనారు.
Recommended Video


అమ్మ నియమించారు
జయలలితకు సంబంధించిన కీలక సమాచారాన్ని మాజీ చీఫ్ సెక్రటరీ షీలా బాలక్రిష్ణన్ నుంచి ఆర్ముగస్వామి విచారణ కమిషన్ సేకరించిందని తెలిసింది. 2014 మార్చి నెలలో జయలలిత తమిళనాడు ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.

ఆసుపత్రిలో జయలలిత
తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ ప్రభుత్వ పథకాలు ప్రవేశ పెట్టడంలో షీలా బాలక్రిష్ణన్ కీలకపాత్ర పోషించారు. జయలలిత అపోలో ఆసుపత్రిలో 75 రోజుల పాటు చికిత్స పొందుతున్న సమయంలో ప్రభుత్వం నుంచి తమిళనాడు ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురుకాకుండా షీలా బాలక్రిషన్ చూసుకున్నారు.

వెంటనే తప్పుకున్నారు
జయలలిత మరణించిన తరువాత రెండు నెలల పాటు తమిళనాడు ప్రభుత్వ సలహాదారుగా ఉన్న షీలా బాలక్రిషన్ పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి తప్పుకున్నారు.

అమ్మ విజయంలో !
జయలలిత 2015 శాసన సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ విజయం సాధించడానికి జయలలితకు షీలా బాలక్రిష్ణన్ ఎంతో సహకరించారు. జయలలితకు సంబంధించిన అనేక విషయాలు షీలా బాలక్రిష్ణన్ కు తెలుసని సమాచారం.

మొత్తం చెప్పారు ?
జయలలితకు సంబంధించిన అనేక విషయాలు సేకరించడానికి ఆర్ముగస్వామి విచారణ కమిషన్ షీలా బాలక్రిష్ణన్ ను విచారించి వివరాలు సేకరించారు. జయలలితకు సంబంధించి అనేక విషయాలు షీలా బాలక్రిష్ణన్ వెళ్లడించారని తెలిసింది.












Click it and Unblock the Notifications