శశికళ కోసం మంత్రి పదవి త్యాగం: జయలలిత ఓటర్ల దెబ్బతో !
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళను చూడాలనేది మా కోరిక అంటూ ఒంటికాలి మీద నిలబడిన ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి ఆర్ బి. ఉదయ్ కుమార్ ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
అసవరమైతే తాను మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, తన నియోజక వర్గం తిరుమంగళం నుంచి చిన్నమ్మ శశికళను పోటీ చేయించి గెలిపిస్తానని, అంత వరకు నిద్రపోనని సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
జయలలిత మృతితో చెన్నైలోని ఆర్ కే నగర్ నియోజక వర్గం ఖాళీ అయిన విషయం తెలిసిందే. అయితే ఆర్ కే నగర్ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే మిమ్మల్ని కచ్చితంగా ఓడిస్తామని స్థానిక ఓటర్లు శశికళను ఇప్పటికే హెచ్చరించారు.

ఆర్ కేనగర్ లో శశికళకు వ్యతిరేకంగా స్థానిక అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే పెద్ద ఎత్తున ఫెక్సీలు ఏర్పాటు చేశారు. ఆర్ కే నగర్ నుంచి పోటీ చేస్తే శశికళ ఓడిపోతారని అన్నాడీఎంకే నాయకులు అంచనా వేశారు.
ఈ సందర్బంలోనే రెవెన్యూ శాఖా మంత్రి ఉదయ్ కుమార్ తాను ప్రానిథ్యం వహిస్తున్న తిరుమంగళం నియోజ వర్గం నుంచి శశికళను పోటీ చేయించి గెలిపించుకుంటానని. తనకు శశికళ కంటే మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి గొప్పకాదని అన్నారు.
శశికళను సీఎంగా చూసే వరకు నేను నిద్రపోనని శపథం చేశారు. ఉదయ్ కుమార్ వ్యాఖ్యలతో అన్నాడీఎంకేలోని నాయకులు కొందరు ఇబ్బందిపడుతున్నారు. మంత్రిగా ఉంటూ సీఎం పన్నీర్ సెల్వంకు వ్యతిరేకంగా మీడియాతో ఇలా మాట్లాడటం ఏమిటని మండిపడుతున్నారు. అయితే రెవెన్యూ శాఖా మంత్రి ఉదయ్ కుమార్ మాత్రం శశికళ జపం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications