కాంగ్రెస్ దొంగే.. కానీ బీజేపీ గజదొంగ: హార్దిక్ పటేల్ సంచలన వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: పటీదార్ ఉద్యమ నేతం హార్దిక్ పటేల్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 'పెద్దదొంగ' బీజేపీని గద్దెదించడం కోసం 'చిన్నదొంగ' కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు.

ఉత్తర గుజరాత్‌లోని మందల్‌లో సోమవారం రాత్రి ఆయన ఓ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ''కాంగ్రెస్ దొంగే... కానీ బీజేపీ అంతకు మించిన గజదొంగ. అందుకే గజదొంగను ఓడించేందుకు దొంగకి మద్దతు ఇవ్వాల్సి వస్తే.. మేము అందుకు కూడా సిద్ధమే. అయితే ఇక్కడ కొంత సంయమనం పాటించాలి. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌కు మద్దతివ్వం...'' అని ఆయన పేర్కొన్నారు.

To defeat ‘mahachor’ BJP, we can support ‘chor’ Congress: Hardik Patel

ఆదివారం రాత్రి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకున్నట్టు వచ్చిన వార్తలను హార్దిక్ పటేల్ ఖండించారు. తాను రాహుల్ గాంధీ బసచేసిన ఉమ్మెద్ హోటల్‌లోనే ఉన్నప్పటికీ.. రాహుల్‌ని కలుసుకోలేదని వివరించారు.

''కాంగ్రెస్ నేతలు నన్ను ఆహ్వానించడంతో ఆదివారం రాత్రి 3 గంటలకు హోటల్‌కి వెళ్లాను. గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ అశోక్‌ గెహ్లాట్‌తో సమావేశం అయ్యాను. అప్పటికే చాలా ఆలస్యం కావడంతో అదే హోటల్‌లో ఉండిపోయాను. అయితే బీజేపీ వాళ్లు మాత్రం గుజరాత్ మొత్తం తమ సొత్తు అయినట్టు సీసీటీవీ వీడియోలతో హడావిడి చేస్తున్నారు...'' అని మండిపడ్డారు.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గుజరాత్‌లోని మూడు ప్రధాన వర్గాలకు చెందిన యువనేతలను చర్చలకు ఆహ్వానించింది. ఓబీసీ నాయకుడు అల్పేశ్ ఠాగూర్, దళిత నేత జిగ్నేశ్ మేవానీ, పటీదార్ నాయకుడు హార్దిక్ పటేల్ తదితరులతో చేతులు కలిపేందుకు కాంగ్రెస్ యోచిస్తోంది.

ఇప్పటికే గాంధీనగర్ ర్యాలీలో ఓబీసీ నాయకుడు అల్పేశ్ ఠాగూర్ కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడమేకాక, రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక దళిత నేత జిగ్నేశ్ మేవానీ మాత్రం అసలు అక్కడికి రాకపోవడం గమనార్హం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Patidar stir leader Hardik Patel on Monday called the Congress a “chor” (thief) and ruling Bharatiya Janata Party a “mahachor” (super thief) and said he will support the grand old party in order to defeat the saffron outfit in Gujarat, where the crucial assembly elections are due later this year. “But have patience. Do not support (Congress) just now,” Patel said addressing a public rally at Mandal in north Gujarat, where he reached a couple of hours late on Monday night. He also admitted he was present at a luxury hotel in Ahmedabad at the same time when the Congress’ vice president Rahul Gandhi checked into the premises but said he did not meet him amid swirling speculations they spoke to each other.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి