Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పన్నీర్ సెల్వంకు ఎంజీఆర్ ఫ్యామిలీ మద్దతు: శశికళకు షాక్

ఎంజీఆర్ కుటుంబ సభ్యులు తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించారు. శనివారం ఎంజీఆర్ 29వ వర్దంతి సందర్బంగా మెరినా బీచ్ లో ఎంజీఆర్ స్మారకం దగ్గర నివాళులు అర్పించారు.

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) 29వ వర్దంతి సందర్బంగా శనివారం చెన్నైలోని మెరినా బీచ్ లోని ఎంజీఆర్ స్మారక మందిరం దగ్గర ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు.

ఎంజీఆర్ కు సమీప బంధువు ( ఎంజీఆర్ భార్య జానకీరామచంద్రన్ ఫ్యామిలీ) అయినా సుధా విజయ్ కుమార్ మెరినా బీచ్ దగ్గర మీడియాతో మాట్లాడుతూ ఎంజీఆర్ ప్రజల కోసం అన్నాడీఎంకే పార్టీ పెట్టారని గుర్తు చేశారు.

 Today is Former CM Dr MGR's 29th Death anniversary

ఎంజీఆర్ తరువాత జయలలిత ఆ పార్టీని ఇన్ని సంవత్సరాలు శక్తి వంచనలేకుండా విజయవంతంగా ముందుకు నడిపించారని అన్నారు. జయలలిత మరణించిన తరువాత ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆమె శిష్యుడిగా ముందుకు నడిపిస్తారానే నమ్మకం మాకు ఉందని సుధా విజయ్ కుమార్ చెప్పారు.

జయలలితనే స్వయంగా రెండు సార్లు పన్నీర్ సెల్వంను సీఎం చేశారని ఆమె గుర్తు చేశారు. అన్నాడీఎంకే నాయకులు అందరూ పన్నీర్ సెల్వంకు మద్దతు ఇవ్వాలని, తమిళ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి సీఎంకు సహకరించాలని ఆమె మనవి చేశారు.

 Today is Former CM Dr MGR's 29th Death anniversary

అంతే కాని గ్రూప్ రాజకీయాలు చేసి ఎంజీఆర్, జయలలితకు చెడ్డపేరు తీసుకురాకూడదని సుధా విజయ్ కుమార్ సూచించారు. ప్రస్తుతం పన్నీర్ సెల్వం పనితీరు బాగుందని, ఆయన అన్నాడీఎంకే పార్టీని ముందుకు తీసుకువెలుతారనే నమ్మకం మాకుటుంబ సభ్యులకు ఉందని అన్నారు.

ఎంజీఆర్ లేకున్నా ఆయన అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తల గుండెల్లో సజీవంగా ఉన్నారని సుధా విజయ్ కుమార్ చెప్పారు. ఇదే సమయంలో ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఎంజీఆర్, జయలలిత అభిమానులు పెద్ద సంఖ్యలో తమ అభిమాన నాయకుడికి నివాళులు అర్పించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+