Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టమోటా వైరస్ కలకలం.. 12 ఏళ్ల లోపు చిన్నారులు బీ కేర్ ఫుల్ !

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో 'టమోటా వైరస్' వ్యాప్తి చెందుతోంది. పాఠశాల పిల్లలలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వైరస్ సోకిన పిల్లల చేతులు, పాదాలు, అరికాళ్లు, మెడ కింద, నోటిలో ఎర్రటి దద్దుర్లు ఏర్పడుతున్నాయి. ఇవి క్రమంగా బొబ్బలుగా మారుతున్నాయి.

ఈ వైరస్ సోకిన పిల్లలు దురద, మంట, నొప్పి, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే స్వభావం కలది కావడంతో, లక్షణాలున్న పిల్లలను ఇంటి వద్దే ఉంచాలని పాఠశాల యాజమాన్యాలు తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తున్నాయి.

tomato-virus-outbreak-in-bhopal-india-and-news-got-viral

పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ రాజేశ్ టిక్కాస్ మాట్లాడుతూ.. ఈ టమోటా వైరస్‌ను హ్యాండ్, ఫూట్‌, మౌత్‌ డిసీజ్‌ (హెచ్‌ఎఫ్‌ఎండీ) అని కూడా అంటారు. ఇది ఎచినోకాకస్, కాక్స్‌సాకీ వైరస్‌ల వల్ల వ్యాపిస్తుంది. ఆరు నెలల నుండి 12 ఏళ్ల వయసు పిల్లలలో ఇది ఎక్కువగా కనపడుతుందని వివరించారు.

హెచ్‌ఎఫ్‌ఎండీ సాధారణ సమస్యేనని, దీనిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ రాజేశ్ తెలిపారు. ఇది సాధారణంగా వారం, పది రోజుల్లో వాటంతట అవే తగ్గుముఖం పడతాయి. మల విసర్జన తర్వాత చేతులు సరిగా కడుక్కోకపోవడం, పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ఈ వైరస్ వ్యాపిస్తుందని చెప్పారు.

అలాగే, వైరస్ సోకినవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా, లాలాజలం వంటి శరీర స్రావాల ద్వారా కూడా ఇది ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుంది. వైరస్ సోకిన 3-6 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. దీనికి ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏదీ లేదు. అయితే, గుండె, ఊపిరితిత్తులు, ఇతర జన్యుపరమైన లోపాలతో బాధపడుతున్న పిల్లలకు ఈ వైరస్ సోకితే, మాత్రం అత్యంత జాగ్రత్తగా చికిత్స అందించాలని స్పష్టం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రాణాపాయం లేకపోయినప్పటికీ.. చిన్నారుల విషయంలో అనారోగ్యం అంటే తల్లిదండ్రులు కలత చెందడం, భయాందోళనకు గురి కావడం జరుగుతుందని నిపుణులు వివరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+