కారులో ఎటిఎస్ ఉన్నతాధికారి, మహిళ అనుమానాస్పదస్థితిలో మరణం, కారులో మృతదేహలు

రాజస్థాన్ కు చెందిన ఎటిఎస్ ఉన్నతాధికారి, మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించారు. సుదీర్ఘంగా సెలవులో ఉన్న ప్రభాకర్ అనే ఐపిఎస్ అధికారి ఇటీవలే విధుల్లో చేరారు.

జైపూర్ :రాజస్థాన్ కు చెందిన పోలీసు ఉన్నతాధికారి, మరో మహిళా కారులో అనుమానాస్పదస్థితిలో మరణించారు. సుదీర్ఘ కాలంపాటు సెలవులో ఉండి, ఇటీవలే విధుల్లో చేరిన ఆ అధికారి ,మరో మహిళతో కలిసి అనుమానాస్పద స్థితిలో మరణించి ఉండడం సంచలనం కలిగించింది.

రాజస్థాన్ కు చెందిన యాంటీ టెర్రరిస్టు స్వ్కాడ్ లో పనిచేసే ఉన్నతాధికారి , మరో మహిళ కారులో అనుమానాస్పద స్థితిలో మరణించి ఉండడం గురువారం రాత్రి పోలీసులు కనుగొన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

జైపూర్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న విదాస్ పురా ప్రాంతంలో రొడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న కారులో అదనపు ఎస్ పి అశిష్ ప్రభాకర్ , మరో గుర్తు తెలియని మహిళ మృతదేహాలు కారులో ఉన్నాయి. ప్రభాకర్ సర్వీస్ రివాల్వర్ నుండి వచ్చిన తూటాలకాల్పులతోనే వారు మరణించినట్టు పోలీసులు ధృవీకరించారు.

top anti-terror officer, woman found dead inside car

ఓ మహిళ కారులో మరణించి ఉందని గురువారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ప్రభాకర్ పోన్ నుండి పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ వచ్చింది. పోలీసులు అక్కడకు వెళ్ళి చూసేసరికి డ్రైవింగ్ సీటులో ప్రభాకర్ మృతదేహం పడి ఉంది. ఆ మహిళ మృతదేహం ప్రభాకర్ ఒళ్ళో ఉంది. కారులో ఖాళీ బీరు సీసాలు కూడ ఉన్నాయి.

కారు లోపలి నుండి తాళం వేసి ఉంది. అయితే ప్రభాకర్ సర్వీసు రివాల్వర్ నుండే వచ్చిన బుల్లెట్ల కారణంగానే వారిద్దరూ చనిపోయారని పోలీసులు నిర్థారించారు. ప్రభాకర్ కు సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంస్థ ఉంది. అయితే చనిపోయిన మహిళ అక్కడే చదువుకొంది, ఇద్దరి మద్య అప్పటి నుండి సంబంధం ఉండి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమౌైతున్నాయి. దీర్ఘకాలంపాటు చదువుకోసం సెలవు తీసుకొన్న తర్వాత ప్రభాకర్ ఇటీవలే ఎటిఎస్ లో చేరారు. ఈ మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+