రైల్వేలో లక్షల ఉద్యోగాలు ఖాళీ- భర్తీపై కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: కొన్ని సంవత్సరాలుగా.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లల్లో ఉద్యోగాల నియామకాలు జరగట్లేదు. ఖాళీలను భర్తీ చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపట్లేదు. ఫలితంగా- రైల్వేలో ఖాళీలు పేరుకుపోయాయి. వివిధ కేటగిరీల్లో లక్షల సంఖ్యలో నియామకాలు స్తంభించాయి.
దీనిపై రాజ్యసభలో సుశీల్ కుమార్ మోదీ అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బదులిచ్చారు. రైల్వేలో జోన్లవారీగా ఉన్న ఖాళీలపై లిఖితపూరకంగా సమాధానం ఇచ్చారు. వాటిని భర్తీ చేయడానికి తగిన చర్యలను తీసుకుంటోన్నామని వివరించారు. ఆర్పీఎఫ్/ఆర్పీఎస్ఎఫ్‌లో చేపట్టాల్సిన రిజర్వేషన్ల కోటాల గురించీ సభ దృష్టికి తీసుకొచ్చారు.

లెవెల్-1 పోస్టులు సహా అన్ని రైల్వే జోన్లల్లో గ్రూప్- సీ విభాగంలో 2,48,895 ఖాళీలు ఉన్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. గ్రూప్- ఏ, బీల్లో 2,070 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. గ్రూప్-సీ కేటగిరీలో జోన్లవారీగా ఉన్న ఉద్యోగాల ఖాళీలకు సంబంధించిన వివరాలను అశ్విని వైష్ణవ్ సభ ముందు ఉంచారు.
గ్రూప్-సీలో సెంట్రల్- 25,281, ఈస్ట్ కోస్ట్- 8,114, ఈస్ట్ సెంట్రల్- 12,812, ఈస్టర్న్- 29,869, మెట్రో- 993, నార్త్ సెంట్రల్- 15,962, నార్త్ ఈస్టర్న్- 12,830, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్- 12,365, నార్తర్న్- 32,438, నార్త్ వెస్టర్న్- 9,813, సౌత్ సెంట్రల్- 10,338, సౌత్ ఈస్ట్ సెంట్రల్- 7,796, సౌత్ ఈస్టర్న్- 13,432, సదరన్- 15,240, సౌత్ వెస్టర్న్- 4,843, వెస్ట్ సెంట్రల్- 11,142, వెస్టర్న్- 25,597 ఖాళీలు ఉన్నాయి.
గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌లపై మొత్తం 1,28,349 మంది అభ్యర్థులు గ్రూప్ సీ పోస్టులకు తమ పేర్లను ఎంప్యానెల్ అయ్యారు. లెవెల్-1 నోటిఫికేషన్‌పై మొత్తం 1,47,280 మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.రైల్వేలో గ్రూప్ ఎ సర్వీసులకు యూపీఎస్సీ ద్వారా నియామకాలు జరుగుతాయని అశ్విని వైష్ణవ్ వివరించారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications