కాలు తగిలితే సారీ చెప్పా: జైరా కేసులో నిందితుడు, 'నా భర్త అలాంటివాడు కాదు'
న్యూఢిల్లీ: దంగల్ నటి జైరా వాసీంకు విస్తారా ఎయిర్ లైన్స్‌లో చేదు అనుభవం ఎదురైన ఘటన దుమారం రేపింది. విమానంలో ప్రయాణిస్తున్న వికాస్ సచ్‌దేవ్ తనతో దారుణంగా ప్రవర్తించినట్లు నటి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.
ఫిర్యాదు చేయడంతో ముంబై పోలీసులు అతనిని అరెస్టు చేశారు. విచారణలో సచ్‌దేవ్ మరో రకమైన వాదన వినిపించారు. తాను కావాలని ఇలా చేయలేదని కాలు తగిలిన వెంటనే నటికి క్షమాపణ చెప్పానని పేర్కొన్నాడు.

మరోపక్క వికాస్ భార్య, కుటుంబీకులు అతనికే మద్దతు తెలుపుతున్నారు. తన భర్త అలాంటి దుర్మార్గుడు కాదని, ఓ వ్యక్తి అంత్యక్రియలకువెళ్లి తిరిగి వస్తూ అలసిపోవడంతో తనను డిస్ట్రబ్ చేయొద్దని విమాన సిబ్బందితో చెప్పాడని వికాస్ భార్య పోలీసులకు తెలిపారు.












Click it and Unblock the Notifications