జూలైలో పర్యటించాల్సిన అందమైన ప్రదేశాలు ఇవే..

దేశంలో అనేక పర్యటక ప్రదేశాలు ఉన్నాయి. ఎన్నో చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాలు, కొండలు కోనలు, జలపాతాలు, హిల్ స్టేషన్స్ ఇలా ఎన్నో ప్రదేశాలు కనువిందు చేస్తున్నాయి. ఇక జూలైలో అనేక ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతుంటాయి. అనేక నగరాల్లో ఉక్కపోత, వేడి ఉంటుంది. ఈ సమయంలో 25 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉండే ఎన్నో అందమైన పర్యాటక ప్రాంతాలు టూరిస్టులను కనువిందు చేస్తాయి.

భారతదేశంలో జూలై నెలలో కూడా 25 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండే ఎన్నో అందమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అక్కడి చల్లని వాతావరణం, పచ్చని ప్రకృతి, జలపాతాలు, స్వచ్ఛమైన గాలి పర్యాటకులను మైమరిపింపజేస్తున్నాయి.

వాటిలో కొన్ని ప్రదేశాల వివరాలు చూస్తే రాజస్థాన్ లోని ఫేమస్ హిల్ స్టేషన్ మౌంట్ అబూ.. ముఖ్యంగా ఈ ప్రాంతం వర్షాకాలంలో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి ఆరావళి పర్వతాలు పర్యటకులను కనువిందు చేస్తున్నాయి. అలాగే ఇక్కడ నక్కీ సరస్సు, అచల్ గఢ్ కోట, దిల్వారా జైన్ ఆలయాలు తప్పక చూడాల్సిన ప్రదేశాలుగా ఉన్నాయి.

అలాగే హిమాచల్ ప్రదేశ్, కిన్నౌర్ జిల్లాలోని కైలాస పర్వత శ్రేణుల దృశ్యాలు మనసును హత్తుకుంటాయి. ఇక్కడి నారాయణ- నాగిణి ఆలయం, చాకా మెడోస్ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. అలాగే ఈ ప్రాంతంలోని యాపిల్ తోటలు, దేవదారు వృక్షాలు చాలా ఫేమస్. ఈ రాష్ట్రంలోనే మరో ముఖ్యమైన పర్యాటక ప్రదేశం షిమ్లా. వర్షాకాలంలో ఇక్కడి ప్రకృతి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. క్రెగ్నానో నేచర్ పార్కులో ప్రకృతి మధ్య నడకను ఆస్వాదించే అవకాశం టూరిస్టులకు దొరుకుతుంది. ఇక్కడే ఉన్న షిమ్లా వాటర్ క్యాచ్ మెంట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని సందర్శించే అవకాశం ఉంది. అలాగే కుఫ్రీ, నద్దేహ్రా కూడా ప్రముఖ టూరిస్టు ప్రాంతాలుగా ఉన్నాయి.

tourism tourist places in indian states in rainy season Here are beautiful places to visit in July

ఇక అరుణాచల్ ప్రదేశ్ లో చూడదగిన ప్రదేశాల్లో తవాంగ్ ఒకటి. ఇక్కడ ప్రసిద్ధమైన తవాంగ్ మఠం, తవాంగ్ వార్ మెమోరియల్, నూరానాంగ్ జలపాతం ప్రముఖ పర్యాటక ప్రదేశాలుగా ఉంటాయి. ఇక్కడే ఉన్న బుమ్ లా పాస్, సంగెత్సర్ సరస్సు కూడా ముఖ్యమైన ప్రదేశాలుగా ఉన్నాయి. అలాగే హిమాచల్ ప్రదేశ్ లోని స్పిటీ వ్యాలీ, కర్ణాటకలోని చిగ్ మగలూరు కూడా ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా పర్యటకులను అబ్బురపరుస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+