విషాదం : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సూసైడ్..
కొత్త సంవత్సరం నాడు కొత్త కొత్త ఆలోచనలతో సంతోషంగా గడపాల్సిన సమయంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. జలంధర్ జిల్లా అదంపూర్‌లోని ఓ గ్రామంలో ఒకే ఇంట్లో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...అదంపూర్‌లోని ఓ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చనిపోయిన వారిలో మన్మోహన్ సింగ్, ఇతని భార్య, ఇద్దరు కుమార్తెలు, మూడేళ్ల పాప కూడా ఉంది. మన్మోహన్ సింగ్‌కు 59 ఏళ్లు. అయితే, ఇతని మృతదేహం ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. అదే గదిలో మిగిలిన వారి మృతదేహాలు మంచంపై పడి ఉన్నాయి. అయితే, వీరంతా ఆర్థిక సమస్యల కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మన్మోహన్ సింగ్ ఒక సూసైడ్ నోట్‌ను కూడా రాసినట్లు అందులో ఆర్థిక సమస్యల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారని జలంధర్ సీనియర్ సూపరింటెండెంట్ ముఖ్వీందర్ సింగ్ భుల్లర్ వివరించారు.

ఆర్థిక సమస్యల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డారు..
ఈ ఘటనలో ముందుగా మన్మోహన్ కుటుంబసభ్యుల గొంతుకోసి ఆ తర్వాత తను ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మధ్యే మన్మోహన్ పెద్ద కుమార్తె తన కూతురితో కలిసి తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. అయితే, ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నట్లు తెలుస్తోంది. కుమారుడికి ఈ మధ్యే పెళ్లయి విదేశాల్లో ఉంటున్నట్లు పోలీసులు వివరించారు. అయితే, మన్మోహన్ అల్లుడి ద్వారా ఈ కుటుంబ ఆత్మహత్య విషయం బయటపడిందని పోలీసులు తెలిపారు. మన్మోహన్ అల్లుడు ఆదివారం తన భార్యకు ఫోన్‌చేస్తే ఆమె నుంచి అతనికి ఎటువంటి సమాధానం రాలేదని, ఇంట్లోని వారికి ఫోన్ చేసినా ఎవరి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో మన్మోహన్ అల్లుడికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దాంతో ఈ ఆత్మహత్యల విషయం బయటపడింది. అల్లుడితో కలిసి పోలీసులు ఇంటికి వెళ్లి చూడగా, ఇంట్లో ఈ ఐదుగురు విగతజీవులుగా పడి ఉన్నారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications