దీపావళి మిగిల్చిన విషాదం ... పండుగ సరుకుల కోసం వెళ్లి ఆరుగురి దుర్మరణం
దీపావళి పండుగ పూట విషాదం నెలకొంది. పండుగ సరుకుల కోసం వెళ్లి ఆరుగురు దుర్మరణం పాలైన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. దీపావళి పండుగ అందరి జీవితాలలో వెలుగులు నింపితే పండుగను సంతోషంగా జరుపుకోవాలనుకున్న ఆరుగురు కుటుంబాల్లో చీకటిని నింపింది. అత్యంత విషాదాన్ని మిగిల్చింది.
తమిళనాడులోని మధురై జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కోడంగినాయక్కన్‌పట్టి నుంచి దీపావళి సరుకులు కొనేందుకు 13 మంది వ్యక్తులు ఆటోలో ఉసిలంబట్టికి బయలుదేరారు. 13 మంది ప్రయాణికులతో ఆటో ఓవర్లోడ్ కావడంతో కారంబట్టి సమీపంలో వీరి ఆటోను ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొంది. దీంతో ఆటో తునాతునకలైంది.

ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారు తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. దీంతో మృతుల కుటుంబాలలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంతా సంతోషంగా దీపావళి పండుగ జరుపుకుందాం అనుకుంటే లారీ రూపంలో మృత్యువు వారిని కబళించి వేస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఘోర రోడ్డు ప్రమాదంలో పండుగ పూట ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications