విషాదం: ముంబయిలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం..
నవీ ముంబైలో నేటి (శనివారం) ఉదయం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ముంబయిలోని షాబాజ్ ప్రాంతంలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం బృందాలు కూడా ఈ సహాయక చర్యలు పాల్గొన్నారు.
శనివారం తెల్లవారు జామున 5గంటల ప్రాంతంలో ఈ విషాద ఘటన జరిగిందని నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పేర్కొన్నారు. ఈ భవనంలో మొత్తం 24 కుటుంబాలు నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక, ఈ ప్రమాదం నుంచి ఇద్దరు వ్యక్తులను సురక్షితంగా బయటికి తీసినట్లు ఇంకా, పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక, ఈ ఘటనపై నవీ ముంబై డిప్యూటీ అగ్నిమాపక అధికారి పురుషోత్తం జాదవ్ మాట్లాడుతూ.. ఉదయం 4.50 గంటలకు భవనం కుప్పకూలినట్లు మాకు సమాచారం వచ్చిందని ఆయన తెలిపారు.

శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందని వివరించారు. కుప్పకూలిన భవనం జీప్లస్3 భవనం. ఇందులో మొత్తం 13ప్లాట్లు ఉన్నాయి. భవనం శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరూ వ్యక్తులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారి పరిస్థితి కాస్త కుదుటగానే ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. అయితే, ఈ భవనం పదేళ్లనాటిదని, ఈ సంఘటనపై పూర్తి విచారణ చేపట్టామని కమిషనర్ వెల్లడించారు. జీప్లస్3 భవన యాజమానిపై చర్యలు కూడా తీసుకుంటామని ఆయన అన్నారు.
భారీ వర్షాలు..
అయితే, గత వారం రోజులనుంచి మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని రాయగడ, రత్నగిరి, సింధుదుర్గ్, పూణే, సతారా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది.ఈ భవనం కూలిపోవడానికి గల కారణాలు ఏమయ్యి ఉంటాయా అని అధికారులు ఆలోచిస్తున్నారు












Click it and Unblock the Notifications