కాశ్మీర్ పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు వెనుక- ఆ వీడియోల్లో..?
అర్ధరాత్రి జమ్మూ కాశ్మీర్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుమంది దుర్మరణం పాలయ్యారు. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. దేశ రాజధాని రెడ్ ఫోర్ట్ వద్ద కారు బాంబు పేలుడు ఉదంతాన్ని ఇంకా విస్మరించకముందే ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, భద్రత అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు.
శ్రీనగర్ నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో ఈ పేలుడు సంభవించింది. ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్న కొన్ని డిటొనేటర్లు, ఇతర పేలుడు పదార్థాలను నిల్వ చేస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగింది. సీసీటీవీ ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం- పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ భవనం పూర్తిగా ధ్వంసమైంది. మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగ కమ్ముకుంది. అగ్నిమాపక దళం, అంబులెన్స్‌లు, సీనియర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఇటీవలే ఫరీదాబాద్ లో ఉగ్రవాదుల నుండి 360 కిలోల పేలుడు పదార్థాలను పోలీసులు, భద్రత సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అందులో కొన్ని పేలుడు పదార్థాలను నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో నిల్వ ఉంచారు. కొన్నింటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. వీటిని పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు పరిశీలిస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మృతదేహాలు 300 అడుగుల దూరం వరకు చెల్లాచెదురుగా పడ్డాయి.
ఈ పేలుడు వెనుక రెండు కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మొదటిది- మెజిస్ట్రేట్ సమక్షంలో అమ్మోనియం నైట్రేట్‌ను సీల్ చేస్తున్నప్పుడు అనుకోకుండా మంటలు అంటుకోవడం. రెండవది- ఉగ్రదాడి. పోలీస్ స్టేషన్ ఆవరణలో నిలిపి ఉన్న ఓ స్వాధీనం చేసుకున్న కారులో ఐఈడీ అమర్చి ఉండవచ్చని, అది ఈ భారీ పేలుడుకు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. జైషే మహమ్మద్ అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ-ఫాసిస్ట్ ఫోర్స్ (PAFF) ఈ దాడికి బాధ్యత వహించినట్లు ప్రకటించింది.
ఢిల్లీ కారు పేలుడు ఘటనలో అరెస్ట్ అయిన డాక్టర్ ముజమ్మిల్ అద్దె ఇంట్లో ఈ 360 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం, తాజాగా పీఏఎఫ్ఎఫ్ తెరమీదికా రావడం వంటి పరిణామాలతో ఉగ్రవాద కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించారు. ఢిల్లీ ఘటనలో అరీఫ్ నిసార్ దార్ అలియాస్ సాహిల్, యాసిర్ ఉల్ అష్రాఫ్, మక్సూద్ అహ్మద్ దార్ అలియాస్ షాహిద్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. గతంలో జమ్మూ కాశ్మీర్ లో చోటు చేసుకున్న కొన్ని అవాంఛనీయ ఘటనలతో సంబంధం ఉందని తేల్చారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications