పట్టాలపై ఎగిరిపడ్డ స్కూల్ బస్- విద్యార్థులు దుర్మరణం
తమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పట్టాలు దాటుతున్న ఓ స్కూల్ బస్సును రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో అయిదుమంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఉదయం 7:45 నిమిషాల సమయంలో కడలూర్ జిల్లాలో ఈ దుర్ఘటన సంభవించింది. జిల్లాలోని సెమ్మంగుప్పం సమీపంలో కడలూర్- ఆలప్పాక్కం స్టేషన్ల మధ్య రైల్వే గేటు దాటుతున్న సమయంలో స్కూల్ బస్సును నంబర్ 56813 విల్లుపురం- మైలాడుథురై పాసింజర్ వేగంగా ఢీ కొట్టింది.

ఈ ఘటనలో బస్సు మొత్తం తుక్కు తుక్కు అయింది. ఎగిరిపడింది. అయిదు మంది విద్యార్థులు సంఘటన స్థలంలోనే మరణించారు. మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్ ఇది. ఇది చెన్నై-తంజావూరు మెయిన్ ట్రాక్ కూడా. చెన్నై నుంచి కడలూరు మీదుగా ప్రతిరోజు సుమారు 15 రైళ్లు దీని మీదుగా నడుస్తుంటాయి. రద్దీతో కూడుకున్న లెవెల్ క్రాసింగ్.
#WATCH | Tamil Nadu | School bus crossing railway tracks hit by train in Sembankuppam, Cuddalore District
— ANI (@ANI) July 8, 2025
Details awaited. pic.twitter.com/uk6vYz6hhf
నిత్యం స్కూల్ బస్సులు సహా పలు వాహనాలు ఈ గేట్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, సరకు రవాణా వాహనాలు వందల సంఖ్యలో దీని మీదుగా తిరుగాడుతుంటాయి. రైలు వచ్చే సమయాల్లో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉంటారు.
ఈ క్రమంలో ఈ ఉదయం స్కూల్ బస్సు రైల్వే గేటు వద్దకు చేరుకున్న సమయంలోనే పాసింజర్ రైలు వస్తోన్న సమాచారం అందడంతో దాన్ని మూసివేయడానికి గేట్ కీపర్ ప్రయత్నించాడు. స్కూల్ బస్ డ్రైవర్ ఆయనను బతిమాలాడు. ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని, బస్ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని కోరాడు. దీంతో బస్సు పట్టాలు దాటడానికి గేట్ కీపర్ అంగీకరించాడు.
#WATCH | Cuddalore, Tamil Nadu | Restoration work is underway at Sembankuppam railway crossing after a school bus crossing the tracks was hit by a train this morning. Two students died, and two students and the bus driver were injured in the accident. pic.twitter.com/FiEz00q1hx
— ANI (@ANI) July 8, 2025
పట్టాలు దాటుతున్న సమయంలో ఈ పాసింజర్.. బలంగా బస్సును ఢీ కొట్టింది. కొన్ని మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. దీని ధాటికి స్కూల్ బస్సు మొత్తం నుజ్జుగుజ్జు అయింది. రైల్వే ట్రాక్ నుండి దూరంగా పడిపోయింది. ఈ ప్రమాదంలో అయిదుమంది విద్యార్థులు మృతి చెందారు. సుమారు 10 మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి.
#WATCH | Tamil Nadu | On a school bus crossing railway tracks hit by a train, Cuddalore SP SP Jayakumar says, "Two students dead, two students and the bus driver injured. The Railway Police, railway authorities and the State Police are conducting further investigation." https://t.co/bt7LAGRyKY pic.twitter.com/BVAOjJWKwb
— ANI (@ANI) July 8, 2025
బస్సును రైలు ఢీకొనడం చూసిన వెంటనే స్థానికులు, వాహనదారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యల్లో దిగారు. బస్సులో చిక్కుకున్న పిల్లలను బయటికి తీశారు. అంబులెన్స్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications