వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిజ్రాలకు బంపర్ ఆఫర్: ఒడిశా ప్రభుత్వం ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్: మహిళలు, పురుషులు, హిజ్రాలు అందరూ మనుషులే. అందరిని సమానంగా చూడటం మన భాద్యత, ధర్మం అని చెప్పిన సుప్రీం కోర్టు ఆదేశాలను ఓడిశా ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చెయ్యాలని నిర్ణయించింది.

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు హిజ్రాలకు ఉన్నత స్థాయి ఉద్యోగాలు కల్పించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హిజ్రాలను జైలు వార్డెర్లుగా నియమించాలని ఒడిశా స్టాప్ సెలెక్షన్ కమిషన్ కు ఒడిశా రాష్ట్ర పోలీసు విభాగం ఆదేశాలు జారీ చేసింది.

Transgenders to participate in Independence Day parade in Odisha

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఒడిశా జైళ్ల శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ మనోజ్ పట్నాయక్ చెప్పారు. హిజ్రాలకు అన్ని శాఖల్లో సరైన ఉద్యోగాలు ఇవ్వాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది.

ఒడిశా ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుని ఇతర రాష్ట్రాల వారికి ఆదర్శంగా నిలిచింది. హిజ్రాలను స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గోనేందుకు అనుమతించింది. ఈ విషయం తెలుసుకున్న హిజ్రాలు హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తమకు ఒడిశా ప్రభుత్వం గొప్ప అవకాశం ఇచ్చిందని అంటున్నారు.

English summary
The Odisha government has allowed the transgenders to participate in the state level parade to be held at Mahatma Gandhi Marg on August 15.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X