దేశంలోని పలు చోట్ల భూప్రకంపనలు: విశాఖలోనూ...

న్యూఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాల్లో బుధవారం భూప్రకంపనలు చేటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ఈ భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ, కోల్‌కతా, పాట్నా, గౌహతి, భువనేశ్వర్ ప్రాంతాల్లో భూమి కంపించింది.

భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలోంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. మయన్మార్‌లో భూకంప కేంద్రం చోటు చేసుకుంది. ఆస్తి, ప్రాణనష్టాలు జరిగిన సమాచారమేదీ లేదు. వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

Tremors in in several places of India

నాగాలాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో భూప్రకంపనలు సంభవించాయి. మయన్నార్‌లో సంభవించిన తీవ్ర భూకంపంతో భారతదేశంలోని ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.భూప్రకంపనలతో కోల్‌కతాలో మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి.

బుధవారం సాయంత్రం 4:08 గంటలకు విశాఖపట్నంలో భూమి స్వల్పంగా నాలుగు సెకన్లపాటు కంపించింది. అక్కయ్యపాలెంలోనూ భూమి స్వల్పంగా కంపించింది. నాలుగు సెకన్ల తర్వాత పరిస్థితి సర్దుమణగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+