మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ట్రయల్ రన్ షురూ: అక్కడ 10 నిమిషాలు హాల్ట్
పాట్నా: దేశంలో త్వరలోనే మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కబోతోంది. రైల్వే మంత్రిత్వ శాఖ దీనికి ముహూర్తాన్ని ఖరారు చేయనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైలును కేంద్ర ప్రభుత్వం దశలవారీగా పట్టాలెక్కిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 18 రైళ్లు వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి. కొత్తగా 19వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుంది.
బిహార్‌లోని పాట్నా- జార్ఖండ్‌లోని రాంచీ మధ్య ఈ రైలు రాకపోకలు సాగించనుంది. ఈ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్ ఇవ్వాళ చేపట్టారు అధికారులు. ఈ ఉదయం 7 గంటలకు పాట్నా నుంచి రాంచీకి బయలుదేరింది. పాట్నా జంక్షన్ స్టేషన్‌లో అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జెండా ఊపి ట్రయల్ రన్‌ను ప్రారంభించారు. పూర్తి స్థాయిలో ఎప్పుడు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని రావాలనేది ఇంకా నిర్ధారించలేదు.

అధికారికంగా ప్రారంభమైన తరువాత ఈ ఎక్స్‌ప్రెస్.. తెల్లవారు జామున 6.55 నిమిషాలకు పాట్నా జంక్షన్ నుంచి బయలుదేరుతుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు రాంచీకి చేరుకుంటుంది. మార్గమధ్యలో జెహనాబాద్, గయ, కోడెర్మా, బర్కాఖానా, హజారీబాగ్, మెస్రాలో దీనికి హాల్ట్ సౌకర్యాన్ని కల్పించారు. గయ స్టేషన్‌లో 10 నిమిషాల పాటు హాల్ట్ సౌకర్యం ఉంది ఈ రైలుకు.
పాట్నా నుంచి బయలుదేరిన తరువాత ఉదయం 8:20 నిమిషాలకు గయ స్టేషన్‌కు చేరుకుంటుంది. ఇక్కడ 10 నిమిషాలు ఆగుతుంది. 8:30 నిమిషాలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు రాంచీకి చేరుకుంటుంది. అదే రోజు మధ్యాహ్నం 2:20 నిమిషాలకు రాంచీ నుంచి బయలుదేరి సాయంత్రం 7 గంటలకు గయ స్టేషన్‌కు చేరుకుంటుంది. 10 నిమిషాల హాల్ట్ తరువాత 7.10 నిమిషాలకు బయలుదేరుతుంది. రాత్రి 8.25 నిమిషాలకు పాట్నా చేరుకుంటుంది.
ట్రయల్ రన్‌లో ప్రతిపాదించిన షెడ్యూల్ ఇది. పూర్తిస్థాయిలో ఈ రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు ఈ ప్రయాణ వేళల్లో మార్పులు చేర్పులు ఉండొచ్చని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులకు అనువైన సమయంలో ఈ రైలును నడిపించడానికి ఈ ట్రయల్ రన్‌లోనే అభిప్రాయాలను సేకరిస్తామని పేర్కొన్నారు. ఆక్యుపెన్సీ రేషియో పెరగడం, ప్రయాణికుల అవసరానికి అనుగుణంగా కొత్త షెడ్యూల్ ఉండొచ్చని అన్నారు.












Click it and Unblock the Notifications