ముక్కోణపు ప్రేమకథ, ప్రేమికుల రోజు పంచాయితీ, ప్రియుడు ఫినిష్, ఎస్కేప్, యువతి!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: ఒకే అమ్మాయిని ఇద్దరు యువకులు ప్రేమించారు. ప్రేమ, అమ్మాయి అంటూ అనేక సార్లు గొడవ పడ్డారు. మూడు రోజుల క్రితం రెండు వర్గాలు గొడవపడ్డాయి. విషయం తెలుసుకున్న పెద్దలు ఇద్దరు యువకులకు నచ్చచెప్పి ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల రోజు రాజీ పంచాయితీ చేస్తామని చెప్పారు. అయితే ముందు రోజు రాత్రి ఓ యకుడు మరో యువకుడిని దారుణంగా హత్య చేసి ఎస్కేప్ అయ్యాడు.

ఒకే ప్రాంతం

ఒకే ప్రాంతం

కర్ణాటకలోని బెంగళూరు గ్రామీణ జిల్లా దోడ్డబళ్లాపురం తాలుకా కచ్చినపాళ గ్రామంలో సంతోష్, హరీష్ అనే ఇద్దరు యువకులు నివాసం ఉంటున్నారు. అదే గ్రామానికి చెందిన యువతిని హరీష్, సంతోష్ ఒకరికి తెలియకుండా ఒకరు ప్రేమించారు.

 బయటపడింది

బయటపడింది

తాను ప్రేమిస్తున్న యువతిని హరీష్ ప్రేమిస్తున్నాడని సంతోష్ కు తెలిసింది. అయితే అమ్మాయి మాత్రం హరీష్ ను ప్రేమించిందని తెలిసింది. ఈ విషయంలో అనేక సార్లు హరీష్, సంతోష్ ల మధ్య వాగ్వివాదం జరిగింది. జనవరి నెలలో హరీష్, సంతోష్ ఒకరిమీద ఒకరు దాడి చేసుకున్నారు. మూడు రోజుల క్రితం హరీష్, సంతోష్ స్నేహితులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు.

 ప్రేమికుల రోజు పంచాయితీ

ప్రేమికుల రోజు పంచాయితీ

గ్రామంలో నిత్యం సంతోష్, హరీష్ స్నేహితులు కొట్టుకోవడంతో ఫిబ్రవరి 14వ తేదీ ఊరి పెద్దలు పంచాయితీ చేసి రాజీ చేస్తామని సంతోష్, హరీష్ కు చెప్పారు. అంత వరకూ ఒకరి మీద ఒకరు దాడి చేసుకోరాదని సంతోష్, హరీష్ ను గ్రామపెద్దలు హెచ్చరించారు.

ఒక్కడే ఉండాలి

ఒక్కడే ఉండాలి


ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల రోజు అమ్మాయి కళ్ల ముందు ఒక్కరే ఉండాలని శివరాత్రి పండగ రోజు సంతోష్ హరీష్ కు చెప్పాడు. మంగళవారం రాత్రి గ్రామంలో అందరూ శివరాత్రి పండగ, జాగరణలో మునిగిపోయారు. హరీష్, సంతోష్ సైతం జాగరణలో పాల్గొన్నారు

 కత్తితో దాడి

కత్తితో దాడి

మంగళవారం రాత్రి హరీష్ తన స్నేహితుడు అంబరీష్ తో కలిసి గ్రామ శివార్లలోకి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన సంతోష్ కత్తి తీసుకుని హరీష్ కడుపు, గొంతు మీద దాడి చేశాడు. తీవ్రగాయాలైన హరీష్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

పంచాయితీ వద్దు, ఫినిష్

పంచాయితీ వద్దు, ఫినిష్


ప్రేమికుల రోజు అమ్మాయి కళ్ల ముందు ఒక్కరే ఉండాలని చాలెంజ్ చేసిన సంతోష్ అన్నంతపని చేశాడు. ఆసుపత్రిలో చికిత్స విఫలమై హరీష్ మరణించాడు. మీరు వద్దూ మీ పంచాయితీ వద్దూ అంటూ హరీష్ ను హత్య చేసిన సంతోష్ అక్కడి నుంచి పరారైనాడు. పోలీసులు సంతోష్ కోసం గాలిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In Doddaballapur's Kachinahala young man Santhosh murdered Harish. They both were in love with the same girl. complaint lodge in Doddaballapura rural police station.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి