వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీదీకా బోలో... బెంగాల్‌లో ప్రారంభమైన ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్...

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ, తృణముల్ కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు రాజకీయాలు కొనసాగుతుండంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అలర్ట్ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో పోగోట్టుకున్న ఓట్లను తిరిగి రాబట్టుకునేందుకు నడుం బిగించారు. రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహాలకు బెంగాల్‌ ముఖ్యమంత్రి పదును పెడుతోంది. ఇందులో బాగంగానే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

ప్రశాంత్ కిషోర్ ఎంటర్‌తో మారిన బెంగాల్ రాజకీయాలు

ప్రశాంత్ కిషోర్ ఎంటర్‌తో మారిన బెంగాల్ రాజకీయాలు

తృణముల్ కాంగ్రెస్ పార్టీని క్రిందిస్థాయి వరకు తీసుకెళ్లి పార్టీని పటిష్టం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చర్యలు చేపట్టింది.ఈనేపథ్యంలో వంద రోజుల్లో పదివేల గ్రామాలను చుట్టి వచ్చే విధంగా ప్రణాళికలు సిద్దం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ, తృణముల్ పార్టీల మధ్య రాజకీయ వైరం తీవ్రమైన పరిస్థితుల్లో పార్టీపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా గడిచిన ఎన్నికల్లో బీజేపీ 17 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడంతో మమతా బెనర్జీకి చుక్కెదురైంది. ఈ నేపథ్యంలోనే ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టకునే స్కీంకు తెరలేపింది.

నేరుగా ప్రజలతో సంబంధాలు

నేరుగా ప్రజలతో సంబంధాలు

ఇందులో బాగంగానే కార్యకర్తలు, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఓ టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించింది. నేటి 100 రోజుల పాటు పల్లే బాట కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు సుమారు 1000 మంది 10 వేల గ్రామాల్లో పర్యటించాలని ఆదేశించింది. దీంతో పాటు గ్రామాల్లో బస చేయాలని నిర్ణయించింది. గ్రామస్థుల సమస్యలు తెలసుకోవడంతో పాటు వారితో కలిసి భోజనం చేయాలని నిర్ణయించింది. ఇలా వంద రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేసింది.

ఆన్‌లైన్‌లో సేవలు

ఆన్‌లైన్‌లో సేవలు

మరోవైపు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు దీదీకా బోలో అనే ఓ వెబ్‌సైట్‌ను సైతం ప్రారంభించింది. ప్రజలు ఏవైన సమస్యలు ఉంటే దానికి మెయిల్ చేసేందుకు గాను వీలు కల్పించింది. ఈనేపథ్యంలోనే బూత్ స్థాయిలో పార్టీని పటిష్ట పరిచి పార్టీ కమిటీలతో పాటు జిల్లా స్థాయి కమిటీలను పటిష్టం చేయనున్నారు.

English summary
Trinamool Congress (TMC) is doing exactly what its name means -- grass roots. West Bengal Chief Minister and TMC chief Mamata Banerjee announced a toll-free number and a website in an effort to reach out to the grass-roots level.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X