నేడు లోక్‌సభకు ట్రిపుల్ తలాక్ బిల్లు..
ఢిల్లీ : నరేంద్రమోడీ నేతృత్వంలో కొలువుదీరిన ఎన్డీయే సర్కారు తొలి బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది. ముస్లిం మహిళల రక్షణ కోసం రూపొందించిన ట్రిపుల్ తలాక్ బిల్లును న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ సభ ముందు ఉంచనున్నారు. ముస్లిం మహిళలకు ముమ్మారు తలాక్ ఇవ్వడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించే ఈ బిల్లుకు ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ బిల్లు 2019గా నామకరణం చేశారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే ట్రిపుల్ తలాక్ చెప్పడం క్రిమినల్ నేరం అవుతుంది.

జూన్ 12 కేబినెట్ ఆమోదం
ముస్లిం మహిళల సాధికారత కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మోడీ సర్కారు ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకొచ్చింది. జూన్ 12న జరిగిన సమావేశంలో ఈ బిల్లుకు కేబినెట్ ఆమోదం లభించింది. ముమ్మారు తలాక్ చెప్పిన భర్తకు జైలు శిక్ష విధించాలన్న నిబంధనపై ప్రతిపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో గతంలో రాజ్యసభలో ఈ బిల్లు నిలిచిపోయింది. దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపి ప్రతిపక్షాల అభ్యంతరాలు, సూచనల్ని పరిగణలోకి తీసుకొని కొత్త బిల్లు రూపొందించారు. ట్రిపుల్ తలాక్‌కు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండోసారి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. మరో 40రోజుల్లో ఆర్డినెన్సు కాలం చెల్లనుండటంతో ఆలోపు పార్లమెంటు ఆమోదం పొందాలని మోడీ సర్కారు కృత నిశ్చయంతో ఉంది.

16వ లోక్‌సభ రద్దుతో మళ్లీ బిల్లు
వాస్తవానికి గత లోక్‌సభలోనే ట్రిపుల్ తలాక్ బిల్లును మోడీ సర్కారు తీసుకొచ్చింది. అయితే లోక్‌సభ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రాజ్యసభ ఆమోదం పొందలేకపోయింది. నిబంధనల ప్రకారం లోక్‌సభ రద్దైతే ఉభయ సభల ఆమోదం పొందని బిల్లులకు కాలదోషం పడుతుంది. ఒకవేళ బిల్లు లోక్‌సభ ఆమోదం పొంది రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్నా లోక్‌సభ రద్దైన పక్షంలో ఆ బిల్లులు కూడా వాటంతట అవే రద్దయి పోతాయి. ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలోనూ ఇదే జరిగింది.

ఆర్డినెన్స్ తెచ్చిన కేంద్రం
ముస్లిం మహిళలకు విడాకుల విషయంలో జరుగుతున్న అన్యాయంపై స్పందించిన ఎన్డీఏ ప్రభుత్వం గతేడాది ట్రిపుల్ తలాక్ బిల్లును సభలో ప్రవేశపెట్టింది. 2018 సెప్టెంబర్ దానికి లోక్‌సభ ఆమోదం తెలిపినా.. ప్రతిపక్షాల అభ్యంతరాలతో రాజ్యసభ ఆమోద ముద్ర వేయించు కోలేకపోయింది. కేంద్రం ముస్లిం ఉమెన్ ఆర్డినెన్స్ 2019ను తీసుకొచ్చింది. దీని ప్రకారం భారత్‌లో ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్దం. దాన్ని అతిక్రమించిన వారికి మూడేళ్ల జైలు శిక్ష విధించేలా ఆర్డినెన్స్‌లో నిబంధనలు విధించారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications