Trouble: స్టేట్ ప్రెసిడెంట్ కు హైకోర్టులో షాక్, వ్యాపారి కొడుకు కేసు విచారణ, ఇక ఎమ్మెల్యే టిక్కెట్ కథ ?

బెంగళూరు: ప్రముఖ వ్యాపారి కుమారుడి మీద దాడి చేసిన కేసులో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ ఎమ్మెల్యే కుమారుడు మోహమ్మద్ నలపాడ్ కు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ వ్యాపారి కుమారుడిని చితకబాదిన కేసు విచారణకు స్టే ఇచ్చిన హైకోర్టు ఆ స్టేని విస్తరించకపోవడంతో మోహమ్మద్ నలపాడ్ కు కష్టాలు ఎదురైనారు. మోహమ్మద్ నలపాడ్ కేసు విచారణ చెయ్యడానికి సెషన్స్ కోర్టు సిద్దం అయ్యింది. కర్ణాటకలో శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బెంగళూరులో ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలని ఇప్పటికే అర్జీ సమర్పించిన మోహమ్మద్ నలపాడ్, అతని స్నేహితులు ఇప్పుడు కోర్టు విచారణ ఎదుర్కోవలసి ఉంది. నలపాడ్ దెబ్బతో ఇటు కాంగ్రెస్ పార్టీకి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

సీనియర్ ఎమ్మెల్యే కొడుకు

సీనియర్ ఎమ్మెల్యే కొడుకు

బెంగళూరు సిటీలోని శాంతినగర నియోజక వర్గం ఎమ్మెల్యే ఎన్ఏ. హ్యారీస్ కుమారుడు మోహమ్మద్ నలపాడ్ నిత్యం వివాదాల్లో ఉంటున్నాడు. కర్ణాటక యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన మోహమ్మద్ నలపాడ్ కాంగ్రెస్ పార్టీలో యువకులను ఆకర్షించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు.

2018లో రచ్చరచ్చ

2018లో రచ్చరచ్చ

2018 ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి బెంగళూరులోని యూబీ సిటీలో ఫర్జీ కేఫ్ లో ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు విద్వత్ అనే యువకుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఏ. హ్యారీస్ కుమారుడు మోహమ్మద్ నలపాడ్, అతని స్నేహితులు చితకబాదేశారు. విద్వత్ ను ఇష్టం వచ్చినట్లు దాడి చెయ్యడంతో అతనికి తీవ్రగాయాలైనారు.

జైలుకు వెళ్లిన నలపాడ్

జైలుకు వెళ్లిన నలపాడ్

విద్వత్ మీద దాడి చేసిన కేసులో పోలీసులు మోహమ్మద్ నలపాడ్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. 116 రోజులు జైలు జీవితం గడిపిన మోహమ్మద్ నలపాడ్ తరువాత షరతులతో బెయిల్ మీద బయటకు వచ్చాడు. బెంగళూరు వదిలి వెళ్లకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు అనుమతితో మోహమ్మద్ నలపాడ్ ఒకసారి మక్కాకు వెళ్లి వచ్చాడు.

హైకోర్టులో మోహమ్మద్ కు ఎదురు దెబ్బ

హైకోర్టులో మోహమ్మద్ కు ఎదురు దెబ్బ

మోహమ్మద్ నలపాడ్ పై నమోదు అయిన కేసు విచారణ తాత్కాలికంగా నిలిపివేయాలని కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. స్టే గడువు పూర్తి కావడంతో ఆ గడువు విస్తరించడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు ఆదేశాలతో ఇప్పుడు మోహమ్మద్ నలపాడ్ కేసు విచారణ చెయ్యడానికి బెంగళూరు సెషన్ కోర్టు సిద్దం అయ్యింది.

ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలని ఆశ

ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలని ఆశ

కర్ణాటకలో శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బెంగళూరులోని శివాజీనగర నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్ తో ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలని ఇప్పటికే అర్జీ సమర్పించిన మోహమ్మద్ నలపాడ్ ఇప్పుడు కోర్టు విచారణ ఎదుర్కోవలసి ఉంది. నలపాడ్ దెబ్బతో ఇటు కాంగ్రెస్ పార్టీకి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారి కుయారుడు విద్వత్ మీద దాడి చేసిన సందర్బంలో మోహమ్మద్ నలపాడ్ ను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. అయితే ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ మోహమ్మద్ నలపాడ్ ను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+