తాజ్ మహల్ ను చూసి నోరెళ్లబెట్టిన ట్రంప్ కుమారుడు..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు, ప్రముఖ వ్యాపారవేత్త ట్రంప్ జూనియర్ ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించారు. తాజ్ మహల్ కట్టడాన్ని, వాస్తు శిల్పిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాజ్ మహల్ ఎంతో గ్రాండ్ గా.. అందంగా ఉందని కితాబు ఇచ్చారు. ట్రంప్ జూనియర్ రాక నేపథ్యంలో తాజ్ మహల్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సుమారు గంట పాటు తాజ్ మహల్ అందాలను ఆయన ఆస్వాదించారు. ఆయనతో పాటు దాదాపు 40 దేశాల నుంచి 120 మంది స్పెషల్ గెస్టులు తాజ్ మహల్ సందర్శనకు హాజరయ్యారు. ఇక 2020లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తన సతీమణితో కలిసి భారత్ లో పర్యటించారు. ఆ సమయంలో తాజ్ మహల్ ను సందర్శించి ఫోటోలు దిగారు.

ప్రపంచంలోనే ప్రఖ్యాతమైన తాజ్ మహల్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ సందర్శించారు. ఆయనతో పాటు 40 దేశాల నుంచి 120 మంది స్పెషల్ గెస్టులు తాజ్ మహల్ సందర్శనకు హాజరయ్యారు. దాదాపు గంట పాటు తాజ్ మహల్ అందాలను ఆస్వాదించారు ట్రంప్ జూనియర్. అక్కడే ఫోటోలు దిగి సందడిగా గడిపారు. తాజ్ మహల్ అందాలను, కట్టడానికి సంబంధించిన విశేషాలను, శిల్పకళను అడిగి తెలుసుకున్నారు. తాజ్ మహల్ ఎంతో గ్రాండ్ గా.. అందంగా ఉందని ప్రశంసించారు. టూర్ గైడ్ నితిన్ సింగ్.. ఈ కట్టడం విశేషాలను పూర్తిగా ట్రంప్ జూనియర్ కు వివరించారు.

Trump Jr Stunned at Taj Mahal It s Grand and Absolutely Beautiful

ట్రంప్ జూనియర్ సందర్శన నేపథ్యంలో ఆగ్రా చుట్టుపక్కల అలాగే తాజ్ మహల్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఈ నెల 21, 22 తేదీల్లో రాజస్థాన్ లోని ఉదయ్ పుర్ లో జరగనున్న ఓ ఇండో- అమెరికన్ వ్యాపారవేత్త కుమారుడి వివాహంలో పాల్గొనేందుకు ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ భారత్ కు వచ్చారు. 2018లోనూ ట్రంప్ జూనియర్ భారత్ లో పర్యటించారు. దీంతో ఇది ఆయనకు రెండో పర్యటన కావడం విశేషం. ఇక ఉదయ్ పూర్ లో జరిగే ఈ వివాహ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల నుంచి 126 మంది అతిథులు హాజరు కానున్నారు. దీంతో ఉదయ్ పూర్ లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలో జస్టిన్ బైబర్, జెన్నీ ఫర్ లోపెజ్ తమ ఆటపాటలతో అలరించనున్నారు.

ఇక తాజ్ మహల్ కట్టడాన్ని 1983లో UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చారు. అలాగే 2007లో.. తాజ్ మహల్ ను ప్రపంచంలోని 7 కొత్త వింతల్లో ఒకటిగా ప్రకటించారు. తాజ్ మహల్ కట్టడం ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రాలో యమునా నది ఒడ్డున ఉంది. ఈ కట్టడాన్ని మొఘలుల కాలంలో ఆనాటి మొఘల్ చక్రవర్తి షాజహాన్.. తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం కట్టించారు. తాజ్ మహల్ నిర్మాణం 1631 లో ప్రారంభమైంది.. 1653 నాటికి పూర్తయింది. ఆనాటి నుంచి నిత్యం దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఈ అద్భుత కట్టడాన్ని చూసేందుకు వస్తుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+