టీటీడీ, సాయి సంస్థాన్, రామకృష్ణ మిషన్.. 6 వేల ఎన్జీవోల్లో ఇవీ..
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్ఏ) క్రింద 6,000 సంస్థలకు మంజూరైన లైసెన్సుల కాలం చెల్లింది. అవీ తమ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోని సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్ర హోంశాఖ పేర్కొంది. అయితే అందులో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, అలాగే రామకృష్ణ మిషన్, శిరిడి శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఉంది.
ఇవీ విదేశీ నిధులను పొందేవి. అయితే రిజిస్ట్రేషన్ తర్వాత ఏటా రెన్యువల్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. విద్య, మత, ఆర్థిక , సాంస్కృతిక అంశాల కోసం నిధులను సమీకరిస్తారు. వీటితోపాటు జాబితాలో ఐఐటీ-ఢిల్లీ, జామియా మిలియా ఇస్లామియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, గ్రంథాలయం, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ ఫౌండేషన్, లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ వుమెన్, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఆక్స్‌ఫామ్ ఇండియా కూడా ఉన్నాయి. ఎఫ్‌సీఆర్ఏ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ వివరాలను పేర్కొన్నారు.

ఎఫ్‌సీఆర్ఏ క్రింద నమోదైన ప్రభుత్వేతర సంస్థలు (ఎన్‌జీవోలు), అసోసియేట్ల కార్యకలాపాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నియంత్రిస్తుంది. ఈ చట్టం ప్రకారం ఈ సంస్థల రిజిస్ట్రేషన్లు జనవరి 1తో ముగిసినట్లు పరిగణిస్తామని హోం మంత్రిత్వ శాఖ అధికారులు చెప్పినట్లు జాతీయ మీడియా తెలిపింది. సంఘాలు, ఎన్‌జీవోలు విదేశీ విరాళాలను స్వీకరించాలంటే ఎఫ్‌సీఆర్ఏ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. శుక్రవారం వరకు ఈ రిజిస్టర్డ్ ఎన్‌జీవోలు 22,762 ఉండేవి, వీటిలో 5,933 ఎన్‌జీవోల లైసెన్సుల గడువు శనివారంతో ముగిసిన సంగతి తెలిసిందే. ఆ 6 వేల సంస్థల్లో టీటీడీ, ఆర్కే మఠ్, సాయి సంస్థాన్ కూడా ఉన్నాయి. ఇవీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications