Mysuru: వేదం సకల సంపదలకు మూలం, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ, హాజరైన టీటీడీ చైర్మన్ !
మైసూరు/ తిరుపతి: మానవుల మనుగడకు అవసరమైన ఇహపర సుఖాలను ప్రసాదించే మంత్రాలు వేదాల్లో ఉన్నాయని, ఇలాంటి వేదాలు సకల సంపదలకు మూలమని శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ ప్రబోధించారు. మైసూరులోని దత్తపీఠంలో టీటీడీ ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల నుంచి శ్రీనివాస చతుర్వేద హవనం నిర్వహిస్తున్నారు. శ్రీనివాస చతుర్వేద హవనంలో అన్ని వేదాలలోని మంత్రాలతో యజ్ఞవిష్ణును ఆరాధిస్తున్నారని, వేదం జీవులందరి కోరికలను ప్రసాదించగలిగే శక్తిని కలిగి ఉందని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ చెప్పారు. మానవుల సమస్త కోరికలు ఈనాడు డబ్బుతో ముడిపడ్డాయని భావిస్తున్నారని, మాములుగా ధనాన్ని సంపాదించిన వ్యక్తుల ఇళ్ళలో రెండు తరాలు లేదా మూడుతరాల నిలవడం చూస్తున్నామని, కానీ అమోఘమైన వేదాశీర్వచనాన్ని పొందిన కుటుంబాలలో లక్ష్మీదేవత తొమ్మిది తరాలకు పైగా స్థిరంగా నిలుస్తుందని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వివరించారు.
మైసూరు దత్త పీరంలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీనివాస చతుర్వేద హవనంలో శ్రీ స్వామీజీ నాలుగో రోజు శనివారం ప్రసంగంలో వేద హవన శక్తిని తెలియజేశారు. శ్రీనివాస చతుర్వేద హవనంలో అన్ని వేదాలలోని మంత్రాలతో యజ్ఞవిష్ణును ఆరాధిస్తున్నారని, వేదం జీవులందరి కోరికలను ప్రసాదించగలిగే శక్తిని కలిగి ఉందని స్వామిజీ చెప్పారు.

మానవుల సమస్త కోరికలు ఈనాడు డబ్బుతో ముడిపడ్డాయని భావిస్తున్నారని, మాములుగా ధనాన్ని సంపాదించిన వ్యక్తుల ఇళ్ళలో రెండు తరాలు లేదా మూడుతరాల నిలవడం చూస్తున్నామని, కానీ అమోఘమైన వేదాశీర్వచనాన్ని పొందిన కుటుంబాలలో లక్ష్మీదేవత తొమ్మిది తరాలకు పైగా స్థిరంగా నిలుస్తుందని వివరించారు. మానవులకు ఉత్తమలోకాలు కూడా కేవలం వేద ఆరాధన వల్లే సులభంగా సాధ్యమవుతుందని, కావున ఈ చతుర్వేద హననం సమస్త శ్రీవారి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని స్వామీజీ వివరించారు.
టీటీడీ ఛైర్మన్శ్రీ వైవీ.సుబ్బారెడ్డి ఈ చతుర్వేద హవనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి మాట్లాడుతూ ధర్మప్రచారంలో భాగంగా ఆయా ప్రాంతాల్లో స్వామీజీల సహకారంతో ఇలాంటి చతుర్వేద హవనాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత గోపూజ, అశ్వపూజ, మంటపారాధనలతో చతుర్వేద హవనం నిర్వహించారు.
Recommended Video
సాయంత్రం జ్ఞాన యజ్ఞంలో భాగంగా శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాద్యయన సంస్థ అధికారి డా. ఆకెళ్ళ విభీషణ శర్మ వేద భారతిలో యజ్ఞ విషయాలను, మహిమలను విశ్లేషించారు. నాద యజ్ఞంలో భాగంగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమ భజన మండలి బృందం వారు విష్ణు కీర్తనలను, పండరీ భజనలను చక్కగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో పలువురు వేదభాష్య పండితులు, వేదపండితులు, భక్తులు పాల్గొన్నారు. మైసూరులోని దత్తపీఠంలో టీటీడీ ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల నుంచి శ్రీనివాస చతుర్వేద హవనం నిర్వహిస్తున్నారు. మైసూరులో జరుగుతున్న ఈ కార్యక్రమాలలో పాల్గొనడానికి టీటీడీ చైర్మన్ వైవీ, సుబ్బారెడ్డి హాజరైనారు.
-
శ్రీవారి దర్శనం , వసతి కోసం వేచి చూస్తున్న భక్తులకు TTD గుడ్ న్యూస్, ఇలా సులభంగా..!! -
అలిపిరితో పాటు తిరుమలలో -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !!












Click it and Unblock the Notifications