మోడీ, పళనిసామికి వ్యతిరేంగా టీటీవీ దినకరన్ ఆందోళన, కొని కష్టాలు తెచ్చుకుంటున్నాడా ?
అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ దూకుడు పెంచి కొని కష్టాలు తెచ్చుకోవడానికి సిద్దం అయ్యారని తెలిసింది.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ దూకుడు పెంచి కొని కష్టాలు తెచ్చుకోవడానికి సిద్దం అయ్యారని తెలిసింది. కేంద్ర, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళన చెయ్యాలని తన వర్గానికి పిలుపునిచ్చారు.
నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదని తమిళనాడుకు చెందిన దళిత విద్యార్థిని అనిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గత మూడు రోజుల నుంచి తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అనిత కుటుంబ సభ్యులకు న్యాయం చెయ్యాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.

అనిత ఆత్మహత్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీలు సైతం ఆందోళ చేస్తున్నాయి. అన్నాడీఎంకే పార్టీలో ఎమ్మెల్యేలను చీల్చి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్న టీటీవీ దినకరన్ సైతం ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం మీద ఆందోళన చెయ్యడానికి సిద్దం అయ్యాడు.
సెప్టెంబర్ 9వ తేదిన ఉదయం10 గంటలకు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా తన మద్దతుదారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలని, నీట్ పరీక్షను రద్దు చేసే వరకు పోరాటం చేద్దామని మంగళవారం పిలుపునిచ్చారు. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ లెటర్ హెడ్ లోనే టీటీవీ దినకరన్ ఆ రాష్ట్ర ప్రభత్వానికి వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలని పిలుపునివ్వడం కొసమెరుపు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications