ఆసుపత్రిలో‘అమ్మ’జయలలిత వీడియో: మన్నార్ గుడి మాఫియా పక్కా ప్లాన్ !
చెన్నై: చెన్నై నగరంలోని ఆర్ కే నగర్ ఉప ఎన్నికల పోలింగ్ జరిగే ఒక్కరోజు ముందు తమిళనాడు రాష్ట్రంలో సంచలనం చోటుచేసుకుంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చనిపోవడానికి కొద్ది రోజుల ముందు అపోలో ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్న వీడియోను టీటీవీ దినకరన్ వర్గం బయటపెట్టింది.
Recommended Video


టీవీ చూస్తూ జ్యూస్
టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన అనర్హతకు గురైన అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే వెట్రివేల్ జయలలిత వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో అమ్మ జయలలిత ఆసుపత్రి బెడ్ మీద పడుకుని జ్యూస్ తాగుతూ టీవీ చూస్తున్నట్లు ఉంది.

పచ్చి అపద్దం
జయలలిత వీడియో విడుదల చేసిన అనంతరం అన్నాడీఎంకే పార్టీ అనర్హత ఎమ్మెల్యే వెట్రివేల్ మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో అమ్మను ఎవ్వరూ కలవలేదని చెప్పడం పచ్చి అపద్దం అని, చాల మంది ఆమెను చూశారని అన్నారు.

వీడియో విడుదల చేశాం
అపోలో ఆసుపత్రి అమ్మ చికిత్స పొందుతున్న వీడియో తమ వద్ద ఉందని, దానిని నేడు (గురువారం) విడుదల చేశామని వెట్రివేల్ చెప్పారు. అర్ముగస్వామి విచారణ కమిషన్‌కు కూడా ఈ వీడియో ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెట్రివేల్ అన్నారు.

మన్నార్ గుడి పక్కా ప్లాన్
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు డిసెంబర్ 21 గురువారం జరగనున్నాయి. ఆర్ కే నగర్ లో పోలింగ్ జరిగే ఒక్క రోజు ముందు జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీసిన వీడియో మన్నార్ గుడి మాఫియా పక్కా ప్లాన్ తో విడుదల చేసిందన జోరుగా ప్రచారం జరుగుతోంది.

అనుమతి ఇవ్వలేదు
అమ్మ జయలలిత అపోలో ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఆమెను కలిసేందుకు ఎవ్వరికీ అనుమతి ఇవ్వలేదు. కేవలం జయలలిత నెచ్చెలి వీకే శశికళ నటరాజన్, ఆమె కుటుంబసభ్యులు మాత్రమే ఆసుపత్రిలో అమ్మతో పాటు ఉన్నారు.

అనుమానాలు ?
అమ్మ జయలలిత మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ తమిళనాడు ప్రజలు అంటున్నారు. జయలలిత మరణంపై చాల అనుమానాలు ఉన్నాయని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం నేతలు ఆరోపించారు.












Click it and Unblock the Notifications