శశికళనా మజాకా: అట్టహాసంగా దినకరన్ నామినేషన్, డిపాజిట్ వస్తుందా ?

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ. దినకరన్ గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. ఆయన అనుచరులు, శశికళ వర్గంలోని నాయకులు పెద్ద సంఖ్యలో నామినేషన్ వేసే సమయంలో ఆయన వెంట ఉన్నారు.

గురువారం టీటీవీ. దినకరన్ నామినేషన్ వేశారు. శశికళ వర్గానికి కేటాయించిన టోపి (క్యాప్)నే తల మీద పెట్టుకుని దినకరన్ నామినేషన్ వేశారు. ఆయన వెంట శశికళ వర్గం అనుచరులు పెద్ద సంఖ్యలోనే రావడంతో నియమాల ప్రకారం పోలీసులు వారిని అడ్డుకున్నారు.

TTV.Dinakaran filed his nomination today in RK Nagar constituency. he wor hat on his head while nominating

రెండాకుల చిహ్నం రాకపోవడంతో దినకరన్ కు టోపి గుర్తు వచ్చింది. ఈ నేపథ్యంలో దినకరన్ తో సహ ఆయన వర్గీయులు తల మీద టోపీలు పెట్టుకుని నామినేషన్ వెయ్యడానికి ఆయన వెంట వచ్చారు. ఈ సందర్బంలో దినకరన్ అనుచరులు నానా హంగామా చెయ్యడానికి ప్రయత్నించారు.

ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో నియమాలు ఉల్లంఘించరాదని అధికారులు దినకరన్ అనుచరులకు సూచించారు. రెండాకుల గుర్తు లేకపోతే దినకరన్ ను ఆర్ కే నగర్ ఉప ఎన్నికల నుంచి తప్పించాలని ప్రయత్నించిన శశికళ వ్యూహ్యం బెడిసి కొట్టింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TTV.Dinakaran filed his nomination today in RK Nagar constituency. he wor hat on his head while nominating.
Please Wait while comments are loading...