తమిళనాడు సీఎంను త్వరలోనే మార్చేస్తాం: దినకరన్ గ్రూప్ జోస్యం, కొందరు మౌనం !

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామిని అతి త్వరలో పదవి నుంచి తప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని టీటీవీ దినకరన్ గ్రూప్ లోని ఎమ్మెల్యేలు బెదిరింపులకు దిగుతున్నారు. ఎడప్పాడి పళనిసామి ఎక్కువ రోజులు సీఎంగా ఉండని జోస్యం చెబుతున్నారు.

దినకరన్ గ్రూప్ లోని ఎమ్మెల్యే పళనిసామి (సీఎం కాదు) శనివారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామిపై ఎమ్మెల్యేల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. సీఎంగా కొనసాగడానికి ఎడప్పాడి పళనిసామికి పూర్తి మెజారిటీ లేదని ఎమ్మెల్యే పళనిసామి అన్నారు.

TTV Dinakaran loyalist mla says CM will be shifted soon

పన్నీర్ సెల్వం, పళనిసామి వర్గాలు విలీనం అయినా వారికి మెజారిటీ ఉండదని, త్వరలోనే తమిళనాడుకు కొత్త సీఎం వస్తారని ఎమ్మెల్యే పళనిసామి జోస్యం చెప్పారు. దినకరన్ వర్గంలోని మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు సెంథిల్ బాలాజీ, తోపు వెంకటాచలం తదితరులు విలీనం చర్చలు మొదలైన తరువాత మౌనంగా ఉండిపోయారు.

ఎప్పుడు దినకరన్ వెనుకవేసుకుని వచ్చే సీనియర్ నాయకులు అయిన సెంథిల్ బాలాజీ, తోపు వెంకటాచలం తదితర శాసన సభ్యులు ఎందుకు మౌనంగా ఉన్నారు, వీరందరూ ఏం ప్లాన్ వేస్తున్నారు అంటూ ఇప్పుడు తమిళనాడులో చర్చ మొదలైయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+