లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై అన్నాడీఎంకే పార్టీ నుంచి ఔట్: దినకరన్ కే దిక్కులేదు!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ ప్రతి రోజు ఇష్టం వచ్చినట్లు ప్రవర్థిస్తున్నాడు. అన్నాడీఎంకే పార్టీ పుట్టినప్పటి నుంచి అదే పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకులను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాడు.

చెన్నైకి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావ్: స్పీకర్, పార్టీ చీప్ విప్ భేటీ, రెబల్ ఎమ్మెల్యేలు!

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, తమిళనాడు ప్రభుత్వ చీప్ విప్ రాజేంద్రన్, మంత్రులు జయకుమార్, ఉదయ్ కుమార్, సెంగోట్టయన్ తదితరులను అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించానని టీటీవీ దినకరన్ గతంలో ప్రకటించాడు.

TTV Dinakaran removed Tambidurai from AIADMK party secretary post

ఇప్పుడు శశికళకు అత్యంత ఆప్తుడు అయిన లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురైని అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించానని శుక్రవారం ప్రకటించాడు. అన్నాడీఎంకే పార్టీ ప్రాపగాండ కార్యదర్శిగా పని చేస్తున్న లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురైని పార్టీ పదవి నుంచి టీటీవీ దినకరన్ తప్పించాడు.

సీఎం ఎఫెక్ట్: టీటీవీ దినకరన్, నటుడు సెంథిల్ మీద నాన్ బెయిల్ బుల్ కేసులు: ఏ క్షణంలో!

తంబిదురై స్థానంలో తన వర్గంలోని ఎమ్మెల్యే తంగ తమిళ సెల్వన్ ను నియమించామని శుక్రవారం టీటీవీ దినకరన్ ప్రకటించాడు. అన్నాడీఎంకే పార్టీ లెటర్ హెడ్ తన దగ్గర పెట్టుకున్న టీటీవీ దినకరన్ రోజుకో సీనియర్ నాయకుడిని తప్పిస్తున్నానని ప్రకటిస్తున్నాడు. ఈ విషయంపై స్పంధించిన ఎడప్పాడి పళనిసామి వర్గీయులు దినకరన్ కు పిచ్చిపట్టిందని, ఆయన మంచి వైద్యుడి దగ్గర చికిత్స చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TTV Dinakaran removed Tambidurai from AIADMK party propaganda secretary post and appoints his faction MLA Thanga Tamil Selvan to that post.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X