వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడు రాజకీయం: రిసార్ట్ లో రెబల్ ఎమ్మెల్యేలు, రూ. ఒక కోటి బిల్, డబ్బులు ఇస్తే పంపిస్తాం !

తమిళనాడు సీఎం పళనిసామిపై తిరుగుబాటుకొడుగు రిసార్ట్ లో రెబల్ ఎమ్మెల్యేలు, రూ. ఒక కోటి బిల్లుబిల్లు చెల్లిస్తే ఇంటికి పంపిస్తాం, పట్టించుకోని టీటీవీ దినకరన్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి టీటీవీ దినకరన్ గ్రూప్ లో ఉన్న అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలకు సినిమా కష్టాలు మొదలైనాయి. తమిళనాడులోని సొంత ప్రాంతాలకు వెళ్లిపోతామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

సీఎం పళని గూటికి చేరిన రెబల్ ఎంపీ, దినకరన్ ద్రోహి, డీఎంకేతో కలిసి ప్లాన్, లేడీ లీడర్ ఫైర్ !సీఎం పళని గూటికి చేరిన రెబల్ ఎంపీ, దినకరన్ ద్రోహి, డీఎంకేతో కలిసి ప్లాన్, లేడీ లీడర్ ఫైర్ !

మీరు సొంత ప్రాంతాలకు వెళ్లాలంటే మొదట రిసార్ట్ బిల్లు చెల్లించాలని కొడుగు రిసార్ట్ యాజమాన్యం టీటీవీ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలకు సూచించింది. దాదాపు రూ. ఒక కోటి రూపాయలు బిల్లు చెల్లించాలని కొడుగు రిసార్ట్ యాజమాన్యం చెప్పడంతో దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు షాక్ కు గురైనారు.

TTV Dinakaran Rs 2 crore spent on his AIADMK MLAs

కొడుగు రిసార్ట్ బిల్లు విషయంలో టీటీవీ దినకరన్ పట్టించుకోకపోవడం, రిసార్ట్ యాజమాన్యం బయటకు పంపించకపోవడంతో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు అయోమయంలో పడిపోయారు. చెన్నై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో తమిళనాడు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ కొడుగు రిసార్ట్ నుంచి తప్పించుకుని పారిపోయాడు.

జయలలిత వారసులు ? అక్టోబర్ 5 చెబుతాం: మీకు ఎంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు: ఈసీ !జయలలిత వారసులు ? అక్టోబర్ 5 చెబుతాం: మీకు ఎంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు: ఈసీ !

TTV Dinakaran Rs 2 crore spent on his AIADMK MLAs

మిగిలిన 17 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు రిసార్ట్ బిల్లు చెల్లించలేక విలవిలలాడుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన తరువాత టీటీవీ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు పుదుచ్చేరి సమీపంలోని రిసార్ట్ లో 17 రోజుల పాటు ఎంజాయ్ చెయ్యడంతో అక్కడ దాదాపు రూ. 90 లక్షలకు పైగా రిసార్ట్ బిల్లు చెల్లించారు. ఇప్పుడు కొడుగు రిసార్ట్ లో దాదాపు రూ. ఒక కోటి బిల్లు చెల్లించలేక అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు విలవిలలాడుతున్నారు.

English summary
18 rebel MLAs, who were recently disqualified by the Tamil Nadu Assembly speaker, stay at the resort, so far, has reportedly led to a bill of nearly Rs 1 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X