ముక్కులో ట్యూబ్‌తో బడ్జెట్ చదివిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్
Recommended Video

పనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతున్న పారికర్ గత కొన్నాళ్లుగా సచివాలయానికి హాజరు కాలేదు. అయితే ముక్కులో ట్యూబ్‌తోనే ఇటీవల బయట అధికారులతో కలిసి కనిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు.
బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో తన కుర్చీలో కూర్చొని బడ్జెట్‌ను చదివారు. ఇద్దరు అసిస్టెంట్ల సాయంతో ఆయన బడ్జెట్‌ను చదివి వినిపించారు. తనలో జోష్ ఉందని, ఆ హోష్‌తోనే చురుగ్గా పని చేస్తున్నట్లు పారికర్ తెలిపారు.

కాగా, ఏడాది కాలంగా పారికర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. గత ఏడాది అమెరికాలో ఆయనకు చికిత్స జరిగింది. అక్కడే మూడు నెలల పాటు ఉన్నారు. బడ్జెట్ చదివిన తర్వాత రాఫెల్ డీల్ పైన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ చేసినకామెంట్లకు లేఖ ద్వారా స్పందించారు. అంతకుముందు రోజు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ.. పారికర్‌ను పరామర్శించారు.












Click it and Unblock the Notifications