సిద్ధరామయ్యతో బాబు: రాజధానికి ఢోకా లేదని ప్రకటన
బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారంనాడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సమావేశమయ్యారు. తుంగభద్ర నీటిపై ఈ భేటీ జరిగింది. తుంగభద్ర ఆధునీకరణ వల్ల కర్ణాటకతో పాటు తమ రాష్ట్రంలోని కర్నూలు, అనంతపురం జిల్లాలు ప్రయోజనం పొందుతాయని చంద్రబాబు నాయుడు అన్నారు. భేటీ తర్వాత సిద్ధరామయ్య, చంద్రబాబు కలిసి మీడియాతో మాట్లాడారు.
తుంగభద్ర ఎగువ, దిగువ కాల్వల ఆధునీకరణ గత కొంత కాలంగా జరగలేదని చంద్రబాబు అన్నారు. తుంగభద్రలో పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయిందని అన్నారు. తుంగభద్ర డ్యామ్ దిగువన ఉన్న సుంకేశుల, ఆర్డిఎస్ నీళ్ల పంపిణీపై చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
అనంతపురం జిల్లా పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన విధేయతను చాటుకున్నారని టిడిపి నేత పయ్యావుల కేశవ్ అన్నారు. చంద్రబాబుతో పాటు బెంగళూరు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమాంతర కాలువలపై చర్చించారని చెప్పారు. సానుకూలంగా మాట్లాడిన కర్ణాటక సిఎంకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతపురం, బళ్లారి జిల్లాల ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.
రాజధాని నిర్మాణంలో సమస్య ఉండదు

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో ఏ విధమైన సమస్య కూడా ఉండదని చంద్రబాబు చెప్పారు. బెంగళూరులో ఆయన వ్యవసాయ సాంకేతిక నిపుణులతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం అనేది రైతాంగానికి, ప్రభుత్వానికి ప్రయోజం చేకూర్చేదిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
వ్యవసాయంలో చేర్చాల్సిన సాంకేతిక పరిజ్ఞానంపై నిపుణులతో చర్చించినట్లు తెలిపారు. రైతులు పంటను నిల్వ చేసే అంశంపై కూడా చర్చించినట్లు చంద్రబాబు చెప్పారు. తమ ప్రభుత్వం అనేక రంగాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాలను పెంచుతున్నట్లు తెలిపారు.
చంద్రబాబు సింగపూర్ పర్యటనపై ఉత్తర్వు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సింగపూర్ పర్యటనపై రాష్ట్ర ప్రభుత్తవం ఉత్తర్వు జారీ చేసింది. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు చంద్రబాబు సింగపూర్‌లో పర్యటించనున్నారు. దక్షిణాసియా సదస్సుకు ఆయన ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. పలు వాణిజ్య, వ్యాపార సదస్సుల్లో ఆయన పాల్గొంటారు.
మంత్రులు నారాయణ, ఢిల్లీలో ప్రత్యేక ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు, ఐఎఎస్ అధికారులు ఎస్పీ టక్కర్, సాంబశివ రావు, జెఎస్వీ ప్రసాద్, గిరిధర్ చంద్రబాబు వెంట సింగపూర్ వెళ్తారు.
-
కర్ణాటకలో అదృశ్యమైన కేరళ అమ్మాయి మృతదేహం లభ్యం -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి












Click it and Unblock the Notifications