తుర్కియే-సిరియా భూకంపం: 3,500కు పెరిగిన మృతుల సంఖ్య... కొనసాగుతున్న సహాయక చర్యలు

కూలిన భవనాలు
Click here to see the BBC interactive

తుర్కియే, సిరియా సరిహద్దుల్లో సోమవారం చాలా తీవ్రమైన భూకంపం వచ్చింది.

ఈ విపత్తులో రెండు దేశాల్లో మృతుల సంఖ్య 3,500 దాటినట్లు అధికారులు చెబుతున్నారు.

తుర్కియేలో సుమారు 2,379 చనిపోయారని, 14,483 మంది గాయపడ్డారని ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ వెల్లడించారు. సుమారు 4,748 భవనాలు కూలి పోయినట్లు తెలిపారు.

ఇక సిరియాలో సుమారు 1,444 మంది చనిపోయిట్లు వార్తలు వస్తున్నాయి.

శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ విపత్తులో మరణాల సంఖ్య 8 రెట్లు ఎక్కువగా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అంచనా వేసింది.

అమెరికా వంటి దేశాలు తుర్కియేకు సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి.

ఇతర దేశాల నుంచి కూడా సహాయక బృందాలు తుర్కియే, సిరియాలకు చేరుకుంటున్నాయి.

ఎంత త్వరగా శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తిస్తే ప్రాణనష్టం అంత తక్కువగా ఉంటుందని లేదంటే ఆ సంఖ్య పెరగొచ్చని నిపుణులు చెబుతున్నారు.

వెంట వెంటనే భూకంపాలు

తుర్కియే తూర్పున 26 కి.మీ దూరంలో ఉన్న నూర్దా నగరంలో గాజియంటెప్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.

7.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ జియోసైన్సెస్ (జీఎఫ్‌జెడ్) ప్రకటించిందని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.

జీఎఫ్‌జెడ్ ప్రకారం భూకంపం కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల దిగువన ఉంది. అదే సమయంలో భూకంప కేంద్రం భూమికి 11 మైళ్ల దిగువన ఉందని యూఎస్‌జీఎస్ తెలిపింది.

ఇది జరిగిన కొద్దిసేపటికే సెంట్రల్ తుర్కియేలో రెండోసారి భూమి కంపించింది.

దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.7గా నమోదైందని యూఎస్‌జీఎస్ వెల్లడించింది. దీని కేంద్రం భూమికి 9.9 కిలోమీటర్ల దిగువన ఉన్నట్లు తెలిపింది.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చూడండి:

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+