వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ, కాంగ్రెస్‌తో యుద్ధం: Twitter అనూహ్య నిర్ణయం -డైరెక్టర్ లేకుండానే కలాపాలు -మహేశ్వరిపై బదిలీ వేటు

|
Google Oneindia TeluguNews

రైతుల ఉద్యమం, కరోనా విపత్తు నిర్వహణలో మోదీ సర్కారు వైఫల్యం, పెట్రోల్ ధరలు తదితర అంశాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా విపక్షాలు సాగించే ప్రచారానికి ఊతంగా నిలబడిందనే ఆరోపణలకు తోడు కొత్త ఐటీ చట్టాల అమలుకు మోకాలడ్డిన సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అటు అధికార బీజేపీతో విబేధాలు కొనసాగుతుండగా, కొత్తగా కాంగ్రెస్ కు కూడా టార్గెట్ అయిన ట్విటర్ సంస్థ భారత్ లో తన కార్యకలాపాలకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది..

జర్మన్ టెక్నాలజీతో కేసీఆర్ సభ -16న huzurabadలో లక్ష మందితో -సీఎంను కలిసిన గెల్లు -ఈటలపై తిట్లుజర్మన్ టెక్నాలజీతో కేసీఆర్ సభ -16న huzurabadలో లక్ష మందితో -సీఎంను కలిసిన గెల్లు -ఈటలపై తిట్లు

భారత దేశంలో కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ఓ డైరెక్టర్‌ను నియమించరాదని ట్విటర్ సంస్థ నిర్ణయించుకుంది. ప్రస్తుతం ట్విటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న మనీశ్ మహేశ్వరిపై బదిలీ వేటు వేసి, అమెరికాలో నూతన బాధ్యతలను అప్పగించింది. కొత్త ఐటీ చట్టాల అమలు విషయంలో మోదీ సర్కారుతో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ట్విటర్ ఈ మేరకు అనూహ్య నిర్ణయాలు తీసుకుంది.

tussle with modi govt, Twitter decides not to have director in India, Manish Maheshwari to US

ఇకపై ట్విటర్ ఇండియా కార్యకలాపాలు 'లీడర్‌షిప్ కౌన్సిల్' మార్గదర్శకత్వంలో జరుగుతాయని ట్విటర్ అధికార ప్రతినిధి ఒకరు శుక్రవారం మీడియాకు తెలిపారు. ట్విటర్ ఇండియా కీలక ఎగ్జిక్యూటివ్స్ ట్విటర్ ఓవర్సీస్ ఎగ్జిక్యూటివ్స్‌కు రిపోర్ట్ చేస్తారని చెప్పారు. మనీశ్ శాన్ ఫ్రాన్సిస్కోలో నూతన బాధ్యతలను చేపడతారని చెప్పారు. నూతన మార్కెట్ అవకాశాలపై ప్రధాన దృష్టితో రెవిన్యూ స్ట్రాటజీ, కార్యకలాపాల విభాగం సీనియర్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు.

ట్విటర్ ఇండియా ఎండీ తొలగింపుపై ట్విటర్ వైస్ ప్రెసిడెంట్ యు-సున్ ఓ ట్వీట్‌లో స్పందించారు.. ''గడచిన రెండేళ్లకుపైగా మా భారతీయ వ్యాపారానికి నాయకత్వం వహించినందుకు మనీశ్ మహేశ్వరికి ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా నూతన మార్కెట్ల కోసం అమెరికా కేంద్రంగా రెవిన్యూ స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ ఇన్‌ఛార్జిగా మీరు కొత్త పాత్ర పోషించబోతున్నందుకు అభినందనలు. ట్విటర్‌కు ముఖ్యమైన అభివృద్ధి అవకాశానికి మీరు నాయకత్వం వహించడం చూడాలని ఆత్రుతగా ఉంది'' అని పేర్కొన్నారు. కాగా,

మరో లక్ష కోట్ల అప్పుకు జగన్ పథకం -అందుకే ఎయిడెడ్ జీవో -2ఏళ్లలో కట్టింది 5ఇళ్లు: ఎంపీ రఘురామ బాంబుమరో లక్ష కోట్ల అప్పుకు జగన్ పథకం -అందుకే ఎయిడెడ్ జీవో -2ఏళ్లలో కట్టింది 5ఇళ్లు: ఎంపీ రఘురామ బాంబు

కొత్త ఐటీ చట్టాల విషయంలో కేంద్రంతో తీవ్ర స్థాయిలో గొడవలు పడిన ట్విటర్ చానాళ్ల తర్వాతగానీ దిగిరాలేదు. నెలలపాటు మాటల యుద్దం తర్వాత, విన‌య్ ప్ర‌కాశ్‌ను ఇండియాలో రెసిడెంట్ గ్రీవియ‌న్స్ ఆఫీస‌ర్‌గా నియ‌మించింది. ఇండియాలో కొత్త ఐటీ నిబంధ‌న‌ల‌ను పాటించ‌ని ట్విట‌ర్ తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. ఈ గ్రీవియ‌న్స్ ఆఫీస‌ర్‌తోపాటు చీఫ్ కాంప్ల‌యెన్స్ ఆఫ‌సీర్‌, నోడ‌ల్ ఆఫీస‌ర్‌ను కూడా నియ‌మించాల్సి ఉంది. మిగ‌తా అన్ని సోష‌ల్ మీడియా సంస్థ‌లు కొత్త ఐటీ నిబంధ‌న‌ల‌కు అంగీక‌రించినా.. ట్విట‌ర్ మాత్రం త‌న‌కు ఇంకా స‌మ‌యం కావాల‌ని అడుగుతూ వ‌చ్చింది. దీంతో ప్ర‌భుత్వం ఈ సంస్థ‌ల‌కు ఇచ్చే చ‌ట్ట‌ప‌ర‌మైన ర‌క్ష‌ణ‌ల‌ను కూడా ఎత్తేసింది. దీనిపై కోర్టుకెళ్లినా.. అక్క‌డా ట్విట‌ర్‌కు చుక్కెదురైంది. గ్రీవియ‌న్స్ ఆఫీస‌ర్‌ను నియ‌మించ‌డానికి త‌న‌కు 8 వారాల స‌మ‌యం కావాల‌ని గురువారం ఢిల్లీ హైకోర్టును కోరిన ట్విట‌ర్.. నాలుగు రోజుల్లోనే నియ‌మించ‌డం గ‌మ‌నార్హం.

ఐటీ చట్టం అమలుకు ఎట్టకేలకు తలూపిన ట్విటర్ తన ఫిర్యాదుల విభాగానికి వినయ్ ప్రకాశ్ ను చీఫ్ గా నియమించుకున్న తర్వాత ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
కొత్త ఐటీ నిబంధనలను సమ్మతిస్తూ ట్విట్టర్‌ 'భారత్‌ పారదర్శక నివేదిక: వినియోగదారుల ఫిర్యాదులు, క్రియాశీల పర్యవేక్షణ జూలై 2021' పేరిట తొలి కాంప్లియెన్స్‌ నెలవారీ నివేదికను ఇటీవల విడుదల చేసింది. దీంట్లో భాగంగా మే 26-జూన్‌ 25 మధ్య 94 ఫిర్యాదులు అందాయని తెలిపింది. 133 యూఆర్‌ఎల్స్‌పై చర్యలు తీసుకున్నట్టు వివరించింది. ట్విట్టర్‌ ఖాతాలు రద్దు చేయాలన్న 56 ఫిర్యాదులపై కూడా చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. పిల్లల పోర్నగ్రఫీకి సంబంధించి 18,385 ఖాతాలు, ఉగ్రవాదాన్ని ప్రచారం చేస్తున్న మరో 4,179 ఖాతాలను రద్దు చేసినట్టు పేర్కొంది.

బీజేపీతో, కేంద్రంతో విభేదాలు కొనసాగుతుండగా, కాంగ్రెస్ పార్టీ అధికారిక ఖాతాను, రాహుల్ గాంధీ సహా సుమారు 5వేల మంది కాంగ్రెస్ నేతల ఖాతాను ట్విటర్ బ్లాక్ చేయడం రచ్చకు దారి తీసింది. ఒక రకంగా ట్విటర్‌పై కాంగ్రెస్‌ యుద్ధం ప్రకటించింది. పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ ట్విటర్‌ ఖాతాను స్తంభింపజేయడంపై ఆగ్రహించిన ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అదే సోషల్‌ మీడియా వేదికగా రాహుల్‌కు సంఘీభావ ప్రచారం మొదలు పెట్టారు. వేల సంఖ్యలో పార్టీ అభిమానులు మేమంతా రాహుల్‌గాంధీలమే అంటూ తమ ట్విటర్‌ ఖా తాల పేర్లను రాహుల్‌గాంధీగా మార్చుకున్నా రు. రాహుల్‌గాంధీ అధికారిక ట్విటర్‌ ఖాతా ఫొటోనే ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టుకున్నారు. దాంతో బ్లూటి క్‌ ఉన్న పార్టీ ముఖ్యనేతల ఖాతాలు వందల సంఖ్యలో రాహుల్‌గాంధీ ఖాతాలుగా మారిపోయాయి. సోదరి ప్రియాంకగాంధీ తన పేరును అలాగే ఉంచుకున్నా ప్రొఫైల్‌ పిక్‌గా రాహుల్‌గాంధీ ఫొటోని పెట్టుకున్నారు. ట్విటర్‌ పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఒక పోస్టులో మండిపడ్డారు. యువజనకాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌, తెలంగాణ నేత వంశీచంద్‌రెడ్డి తమ బ్లూటిక్‌ ట్విటర్‌ ఖాతాలను రాహుల్‌గాంధీ పేరిట మార్చేసి, ట్విటర్‌ వ్యతిరేక పోస్టులు పెట్టారు. మరోవైపు,

ప్రపంచవ్యాప్తంగా నకిలీ వార్తల వ్యాప్తిని అడ్డుకునేందుకు ట్విటర్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ట్విటర్‌ తమ వంతు ప్రయత్నంగా ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీలు అసోసియేటెడ్‌ ప్రెస్‌, రాయిటర్స్‌తో భాగస్వామ్యం కానుంది. విశ్వసనీయమైన సమాచారాన్ని వేగంగా అందించడానికి ట్విటర్‌ కృషి చేస్తోందని ఒక ప్రకటనలో తెలిపింది. ఇతర సోషల్ మీడియా కంపెనీల మాదిరిగానే ట్విటర్‌ తన సైట్‌లోని తప్పుదోవ పట్టించే లేదా తప్పుడు సమాచారాన్ని తొలగించే పనిలో నిమగ్నమైంది.ఈ ఏడాది ప్రారంభంలో ట్విట్టర్ బర్డ్‌వాచ్ అనే ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. తప్పుదారి పట్టించే ట్వీట్‌లను గుర్తించడానికి, వాస్తవాలను తనిఖీ చేయడంలో సహాయం చేయాలని ట్విటర్‌ తన యూజర్లను కోరింది. మొదటిసారిగా ట్విటర్‌ అధికారికంగా వార్తా సంస్థలతో కలిసి కచ్చితమైన సమాచారాన్ని అందించడానికి ట్విటర్‌ కృషి చేస్తోందని ట్విటర్‌ ప్రతినిధి పేర్కొన్నారు. ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీలు రాయిటర్స్‌, అసోసియెటేడ్‌ ప్రెస్‌ భాగస్వామ్యంతో ఫేక్‌వార్తలను గుర్తించడం మరింత సులువు అవుతుందని తెలిపారు.

English summary
In a major move that comes in the backdrop of the months-long bitter tussle between Twitter and the Indian government, the social media giant has decided to not appoint any country director for its operations in India. Twitter India's current Managing Director Manish Maheshwari has been given a new role in the US. Besides this, Twitter India will now be guided by a 'leadership council' with its key executives reporting to Twitter's overseas executives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X